Manish Sisodia: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి కరోనాతోపాటు డెంగీ

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నగరంలో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో విడత వినాశనం ప్రారంభమైందని స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒకవైపు కరోనా వినాశనం.. మరోవైపు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

Last Updated : Sep 25, 2020, 08:48 AM IST
Manish Sisodia: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి కరోనాతోపాటు డెంగీ

Delhi Deputy CM Manish Sisodia diagnosed with dengue and COVID-19: ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నగరంలో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో విడత వినాశనం ప్రారంభమైందని స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒకవైపు కరోనా వినాశనం.. మరోవైపు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇటీవలనే ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia ) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 14న కరోనా సోకగా.. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అప్పటినుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే సిసోడియాకు కరోనాతోపాటు డెంగీ (Dengue) కూడా సోకినట్లు ఆయన కార్యాలయ ప్రధాన అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ఆయనకు బ్లడ్ ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోయినట్లు వెల్లడించారు. దీంతో సిసోడియాను లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రి నుంచి ఢిల్లీలోని మాక్స్ ఆసుపత్రికి తరలించినట్లు గురువారం అధికారులు వెల్లడించారు. Also read: Delhi CM Kejriwal: ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది

హోం ఐసోలేషన్‌లో ఉన్న మనీశ్ సిసోడియాకు బుధవారం శ్వాస సంబందిత సమస్యలు తలెత్తడంతో.. ఆయన్ను లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయనకు డెంగీ ఉన్నట్లు నిర్థారణ కావడంతో లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రి నుంచి ఢిల్లీలోని మాక్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2.6లక్షలు దాటింది. మళ్లీ ఢిల్లీలో కరోనా మరో విడత వినాశనం ప్రారంభమైందని సీఎం కేజ్రీవాల్ సైతం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉపముఖ్యమంత్రికి కరోనాతోపాటు డెంగీ కూడా నిర్ధారణ కావడంతో నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు ముందు పరీక్షలు చేయించుకోగా.. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్‌తోపాటు డిప్యూటీ సీఎం సిసోడియాకు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. Also read: RCB vs KXIP: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత

Trending News