Delhi Earthquake Today: ఢిల్లీలో మంగళవారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 2.5 గా నమోదైంది. ప్రస్తుతానికి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అదృష్టవశాత్తుగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ లేదా ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. ఢిల్లీకి పశ్చిమాన 8 కిమీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు భూకంపం జాతీయ అధ్యయన కేంద్రం వెల్లడించింది.
Earthquake of Magnitude:2.5, Occurred on 29-11-2022, 21:30:10 IST, Lat: 28.61 & Long: 77.12, Depth: 5 Km ,Location: 8km W of New Delhi, India for more information Download the BhooKamp App https://t.co/yX8dmXeqi4@Indiametdept @ndmaindia pic.twitter.com/VEJ02OFIFt
— National Center for Seismology (@NCS_Earthquake) November 29, 2022
గత నెల రోజుల్లో ఢిల్లీలో భూకంపం రావడం ఇది మూడోసారి. మొదటిసారిగా నవంబర్ 9న ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ఆరోజు భూకంపం తీవ్రత 6.3 గా మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. నవంబర్ 12న రెండోసారి భూకంపం సంభవించింది. రెండో సారి సంభవించిన భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.4 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. వాస్తవానికి నేపాల్లో భూకంపం సంభవించినప్పటికీ.. దాని ప్రకంపనలు ఢిల్లీని తాకాయి.