Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ రోజు ఢిల్లీ బాద్ షా ఎవరనేది ప్రజలు నిర్ణయించే రోజు. దేశ రాజధాని లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగించేందకు కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. సోమవారం సాయంత్రంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. అప్పటి వరకు ప్రచారాలతో ప్రధాన పార్టీలు హోరెత్తించాయి. దేశ రాజధానిలో ప్రధాన పోటీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మధ్య జరగనుంది.
హస్తినలో గత మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పోటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కంటే కాంగ్రెస్ కూడా పుంజుకోవడం విశేషం. ఈ ఎన్నికల సంబంధించిన ఫలితాను ఫిబ్రవరి 8న వెలుబడనున్నాయి. 1993 తర్వాత ఢిల్లీ పీఠం భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షగా మిగిలింది. ఈ సారైనా ఢిల్లీ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుందా లేదా అనేది ఫిబ్రవరి 8న తేలనుంది.
ఎన్నికల్లో గెలుపు కోసం ఆమ్మ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రజలకు ఉచితాలను ప్రకటించాయి. ఈ ఉచితాల్లో ఎవరు తక్కువ తినలేదన్నట్టు అందరు గంపగుత్తగా ఓటర్లపై హామిల వర్షం కురిపించారు. 2013 ఎన్నికల ముందు వరకు షీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీని 15 యేళ్లు పరిపాలించింది. ఇపుడు మరోసారి తమకు గెలిపించి అధికారం ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తోంది.
ఢిల్లీలో 13,766 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. మొత్తంగా 1.56 కోట్ల మంది ఢిల్లీ భవిష్యత్తును నిర్ణయించనున్నారు. మొత్తంగా 70 శాసనసభ స్థానాలకు గాను 699 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఇక దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం 733 కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ తో పాటు దివ్యాంగులు దాదాపు 7980 మంది తమ ఓటు హక్కును ఉపయోగించారు.
దేశ రాజధానిలో పోలింగ్ నేపథ్యంలో 200 పైగా కేంద్ర పారా మిలటరీ బలగాలతో పాటు 35 వేల మంది పైగా ఢిల్లీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మరోవైపు 15 వేల మంది హోం గార్డులు ఎన్నికల డ్యూటీలో భాగస్వామ్యం కానున్నారు. మొత్తం పోలింగ్ బూతుల్లో 3 వేలకు అతి సున్నితమైన ప్రాంతాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఈ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ శాసన సభ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి బీజేపీ తరుపున పర్వేష్ వర్మ.. కాంగ్రెస్ తరుపున షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. కల్కాజీ నుంచి సీఎం అతిసి మార్లేనా.. బీజేపీ తరుపున రమేశ్ బిధూరి.. కాంగ్రెస్ పార్టీ తరుపు అల్కా లాంబా బరిలో ఉన్నారు. పర్ఫట్ గంజ్ స్థానం నుంచి కాకుండా జంగ్ పూర్ నుంచి మనీష్ సిసోడియా ఆప్ తరుపున బరిలో ఉన్నారు. షాకుర్ బస్తీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరుపున సత్యందేర్ జైన్ పోటీ పడుతున్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.