Earthquake in Ladakh: లఢఖ్: ఉత్తరాదిన తరచుగా సంభవిస్తున్న భూకంపాలు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం హరియానాలోని రోహ్తక్లో భూకంపం సంభవించిన కొన్ని గంటలకే లఢఖ్‌లో భూకంపం ( Ladakh earthquake) సంభవించింది. రాత్రి 8.15 గంటలకు సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.5 గా నమోదైనట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ( NCS) వెల్లడించింది. ( Haryana Earthquake: ఉత్తర భారతాన్ని వణికిస్తోన్న వరుస భూకంపాలు )
లఢఖ్‌లో ఇప్పటికే ఓవైపు భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా.. మరోవైపు అక్కడ భూ ప్రకంపణలు రావడం అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. కార్గిల్ ( Kargil )కి వాయువ్య దిశలో సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ( Epicenter ) ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సైజ్మాలజీ ( National Centre For Seismology ) ప్రకటించింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..