Vande Bharat Sleeper Train: దేశంలో అత్యంత ఆదరణ పొందిన వందేబారత్ రైళ్ల విషయంలో కీలకమైన అప్‌డేట్ వెలువడింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సక్సెస్ తరువాత రైల్వే శాఖ వందేభారత్ స్లీపర్ రైళ్ల పై దృష్టి సారించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం కూడా వచ్చేసింది. ఆగస్టు 15వ తేదీన దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
వందేభారత్ భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే చెన్నైలో తయారవుతున్నాయి. స్లీపర్ రైళ్ల ఫోటోలు కూడా అత్యంత ఆధునికంగా ఉండి వైరల్ అయ్యాయి. ఇప్పుుడు త్వరలో అంటే ఆగస్టు 15 నుంచి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం కావచ్చని అంచనా. అది కూడా తొలి వందేభారత్ స్లీపర్ రైలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటుందని తెలుస్తోంది. దక్షిణ మధ్య రైల్వే ఈ మేరకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. వందేభారత్ స్లీపర్ రైలును కాచీగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ప్రారంభించే ఆలోచనలో దక్షిణ మధ్య రైల్వే ఉంది. రైల్వేలో బిజీ రూట్స్‌గా పరిగణించే కాచీగూడ-విశాఖపట్నం, కాచీగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పూణే మధ్య వందేభారత్ స్లీపర్ రైళ్లను నడిపే ఆలోచనలో దక్షిణ మధ్య రైల్వే ఉందని తెలుస్తోంది.
వందేభారత్ స్లీపర్ రైలు ఎలా ఉంటుందంటే
వందేభారత్ స్లీపర్ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ రెండు విభాగాలుంటాయి. ఇక టికెట్ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. వందేభారత్ స్లీపర్ రైలు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ట్రైన్ బయటి డిజైన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లానే ఉంటుంది. స్లీపర్ రైలులో 16 కోచ్‌లు, 823 బెర్త్‌లు ఉంటాయి. ఇందులో ప్రయాణీకులకు ఫ్లైట్‌లో ఉండే సదుపాయాలుంటాయి. ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ కోసం ప్యాంట్రీ లాంటి ఏర్పాట్లుంటాయి. వందేభారత్ స్లీపర్ రైలు ఎక్స్‌టీరియర్ అంతా ఆటోమేటిక్ డోర్, ఒడోర్‌లెస్ టాయ్‌లెట్స్ సౌకర్యాలతో ఉంటుంది. ట్రైన్ మొత్తం పూర్తిగా సౌండ్ ప్రూఫ్‌గా ఉండటం వల్ల ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిద్రించగలరు.
వందేభారత్ స్లీపర్ రైళ్లతో పాటు త్వరలో వందేభారత్ మెట్రో సర్వీసు ప్రారంభించే ఆలోచనలో ఇండియన్ రైల్వేస్ ఉంది. కాన్పూర్-లక్నో, ఢిల్లీ-మీరట్, ముంబై-లోనావాలా, వారణాసి-ప్రయాగ్‌రాజ్, పూరి-భువనేశ్వర్, ఆగ్రా-మధుర మధ్య వందేభారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు నడిపనుంది. ప్రతి కోచ్‌లో 250 మంది సులభంగా ప్రయాణించగలరు.
Also read: Kalingiri Shanthi: బాధ్యతల్లో భాగంగా ఎంపీ విజయ సాయిని కలిస్తే రంకు అంటగడుతారా? కలింగిరి శాంతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook