HMPV Cases In India : గత నాలుగు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ఎంతలా ప్రజలను ప్రభావితం..చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ప్రజలు ఎంతోమంది నేలరాలిపోయారు. ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెంది చాలామంది ప్రాణాలకు ఆటంకం కలిగించింది. ఇదిలా ఉండగా మరొక వైరస్ భారతదేశంలోకి చైనా నుంచి ప్రవేశించినట్లు వైద్యులు తెలియజేశారు. తాజాగా 5 కేసులను భారతదేశంలో కనిపెట్టినట్లు సమాచారం. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) బెంగళూరులో ఉండే ఇద్దరు పిల్లలతో కలిపి మొత్తం 5 మందిలో ఈ వైరస్ కనుగొన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ వైరస్ సోకినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, కేవలం జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయని, వైరస్ ఉధృతి ఎక్కువైనప్పుడు బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలు వస్తాయని, అంతే తప్ప కరోనా వైరస్ అంత ప్రాణహాని ఏమి కాదని వైద్యులు తెలియజేస్తున్నారు.
అయితే భారతదేశంలో అందులోను ఇద్దరు పిల్లలకు ఈ వైరస్ సోకడం అనేది చాలా ఆశ్చర్యంగా మారింది. నిజానికి వీరు విదేశాలకు వెళ్లిన ఆధారాలు కూడా లేవు. దీనికి తోడు ఈ పిల్లలతో ఉన్న పెద్దల్ని కూడా పరీక్షించగా వారికి మాత్రం నెగిటివ్ వచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సమీక్షించినట్లు.దేశంలో శ్వాస కోస వ్యాధుల ప్రస్తుత పరిస్థితిని, వాటి నిర్వహణ కోసం ప్రజారోగ్య చర్యల స్థితిని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సమీక్షించారు. దేశంలో శ్వాసకోశ సమస్యలు పెరుగుదల ఆగిపోయిందని, ఇలాంటి కేసులను గుర్తించేందుకు పటిష్టమైనదిగా నిర్వహించాలను కూడా తెలిపారు. ఇక నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ILI/SARI నిఘాను బలోపేతం చేసి సమీక్షించాలని రాష్ట్రాలు సూచించబడ్డాయి.
ఇకపోతే ఈ వ్యాధి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు, వృద్ధులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మాత్రమే సోకుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇకపోతే పాటించాల్సిన చర్యల విషయానికి వస్తే.. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. ఏదైనా పని చేసిన తర్వాత చేతులు.. ముక్కు, నోరు, కళ్ళకు తగలరాదు. మాస్కులు కంపల్సరిగా ధరించాలి. అలాగే ఎవరికైనా వ్యాధి వచ్చినట్లు గుర్తించినా లేదా జలుబు తో బాధపడుతున్నా.. వారికి దూరంగా ఉండటమే మంచిది.
Also Read: China Virus: తస్మాత్ జాగ్రత్త.. భారత్ లో అడుగెట్టిన చైనా వైరస్.. తొలి కేసు నమోదు..
Also Read: Game Changer: గేమ్ చేంజర్ ఈవెంట్లో అపశ్రుతి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దిగ్భ్రాంతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.