IT Notices: లావాదేవీలు ఇలా ఉంటే ఐటీ నోటీసులు వస్తాయి జాగ్రత్త

IT Notices: వేతన జీవులు, ట్యాక్స్ పేయర్లకు అత్యంత ముఖ్య గమనిక. మీరు ఈ లావాదేవీలు చేస్తుంటే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు జారీ కాగలవు. అందుకే నిర్ణీత వ్యవధిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయండి మరి. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 13, 2025, 11:56 PM IST
IT Notices: లావాదేవీలు ఇలా ఉంటే ఐటీ నోటీసులు వస్తాయి జాగ్రత్త

IT Notices: ఇన్‌కంటాక్స్ శాఖ ఎప్పటికప్పుడు పటిష్టమైన నియమ నిబంధనలు అమలు చేస్తూ ట్యాక్స్ పేయర్లపై గట్టి నిఘా పెడుతోంది. ఫలితంగా ఇన్‌కంటాక్స్ దృష్టి నుంచి తప్పించుకోవడం కష్టమే అవుతోంది. ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు వచ్చాయి. వీటి గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులకు గురవుతారు

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ధాఖలు చేయనివారు,  ఆదాయాన్ని తక్కువగా చూపించేవారిపై ఇన్‌కంటాక్స్ శాఖ కొత్త డేటా పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తోంది. ట్యాక్స్ ఎగవేతకు పాల్పడేవాళ్లు, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారిపై తగిన చర్యలు తీసుకుంటోంది. దీనికోసం వివిధ రకాల ప్రభుత్వ విభాగాల సహకారం తీసుకుని ట్యాక్స్ ఎగవేతదారుల్ని గుర్తించే పనిలో ఉంది. ఏడాది ఆదాయం 2.50 లక్షలు దాటితే విధిగా ఇన్‌‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే వార్షిక ఆదాయం 2.50 లక్షల కంటే తక్కువగా ఉన్నా..లావాదేవీలు ఎక్కువగా జరిపేవారిపై దృష్టి సారించింది. ఇలాంటి వ్యక్తులు తప్పకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోవల్సి ఉంటుంది. 

ముఖ్యంగా కరెంట్ ఎక్కౌంట్‌లో 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే అది భారీ లావాదేవీ కింద పరిగణిస్తారు. విదేశీ ప్రయాణం కోసం 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినా అదే పరిస్థితి. ఎవరైనా ఓ వ్యక్తి ఏడాది కరెంటు బిల్లు 1 లక్ష రూపాయలు దాటినా సరే భారీ లావాదేవీల కేటగరీలో పరిగణిస్తారు. అంటే ఇలాంటి వ్యక్తులపై ఇన్‌కంటాక్స్ నిఘా గట్టిగా ఉంటుంది.

భారీగా నగదు లావాదేవీలను నియంత్రించేందుకు బ్యాంకులు టీడీఎస్ కట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకే ఏడాదిలో 1 కోటి కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. మూడేళ్లుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉండి ఏడాదికి 20 లక్షలు దాటి విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్, 1 కోటి రూపాయలు విత్ డ్రా చేస్తే 5 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. 

మీకు ఒకవేళ ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి ఈ మెయిల్ లేదా మెస్సేజ్ ద్వారా నోటీసు వస్తే వెంటనే ఇన్‌కంటాక్స్ ఇ ఫైలింగ్ ఎక్కౌంట్ లాగిన్ అవాలి. హోమ్ పేజీలో పెండింగ్ యాక్షన్స్ క్లిక్ చేసి ఆ తరువాత కంప్లయన్స్ పోర్టల్‌లో వెళ్లాలి. అక్కడి నుంచి ఇ క్యాంపెయిన్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సంబంధిత ఇ క్యాంపెయిన్ ఎంపిక చేసుకుంటే తిరిగి ఇ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. 

Also read: Public Holidays 2025: విద్యాలయాలు, ఆఫీసులకు సెలవులు, ఎప్పుడు, ఏ రాష్ట్రాల్లో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News