India Corona Cases Today: దేశంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,38,018 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి ధాటికి మరో 310 మంది మృతి చెందారు.
మరోవైపు 1,57,421 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,76,18,271 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,86,784 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 17,36,605 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,53,94,882 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
India reports 2,38,018 COVID cases (20,071 less than yesterday), 310 deaths, and 1,57,421 recoveries in the last 24 hours.
Active case: 17,36,628
Daily positivity rate: 14.43%8,891 total Omicron cases detected so far; an increase of 8.31% since yesterday pic.twitter.com/CaYmWHCPKX
— ANI (@ANI) January 18, 2022
ఇండియా ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 39,46,348 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,57,20,41,825 కు చేరింది.
ప్రపంచంలో కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 20,05,206 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,12,97,997 దాటింది. మరో 5,004 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 55,63,252కి చేరింది.
Also Read: Metaverse Wedding Reception: దేశంలోనే తొలిసారి 'మెటావర్స్'లో వివాహ రిసెప్షన్
Also Read: Corona vaccine for Children: మార్చ్ 12 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook