India Corona Update: దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న కర్ప్యూ, లాక్డౌన్లు సత్ఫలితాలనిస్తున్నాయి. రోజుకు 4 లక్షల కేసుల నుంచి..ఇప్పుడు లక్ష కేసులకు పరిస్థితి చేరింది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) నెమ్మదిగా శాంతిస్తోంది. గత పదిరోజులుగా కేసుల సంఖ్యలో క్రమేపీ తగ్గుదల కన్పిస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. ఓ దశలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదైన పరిస్థితి. ఇప్పుడు రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1 లక్షా 20 వేల 529 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 86 లక్షల 94 వేల 879కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 3 వేల 380 మంది మరణించారు.
దేశంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 3 లక్షల 44 వేల 82 మంది మరణించారు. గత 24 గంటల్లో 1 లక్ష 97 వేల 894 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 15 లక్షల 55 వేల 248 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 22 కోట్ల 78 లక్షల 60 వేల 317 మంది వ్యాక్సినేషన్ (Corona Vaccination) ఇచ్చారు.
Also read: Covid19: ఆ ప్రాంతంలో ఏకంగా 7 వేరియంట్లున్నాయని నిర్ధారణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook