భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్త్రో ఇవాళ ప్రయోగించిన జీశాట్-29 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేసిన ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో ప్రకటించింది. జీశాట్-29 ఉపగ్రహాన్ని మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వి మార్క్ 3 రాకెట్ నిర్ణీత సమయంలో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 10 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజల సమాచార అవసరాలు తీర్చనుందని ఇస్రో చైర్మన్ కే శివన్ పేర్కొన్నారు. 43.4 మీటర్ల పొడువైన ఈ ఉపగ్రహం బరువు 640 టన్నులు.