జమ్మూ కాశ్మీర్ లో ప్రయాణం అంటేనే ఓ సాహసం. అలాంటిది.. అక్కడ కొండ చరియలు విరిగిపడితే ఇంకేమైనా ఉందా..? హిమాలయాల్లో ఎప్పుడూ కొండచరియలు విరిగిపడడం సర్వసాధారణంగా జరుగుతుంది.
Read Also: ''కరోనా వైరస్''పై రైల్వే శాఖ నిర్లక్ష్యం
కానీ ఒక్కోసారి కొండ చరియలు విరిగిపడడం వల్ల రహదారులు మూసుకుపోయే పరిస్థితి ఏర్పుడుతుంది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలోని హింగ్ని బైనిహాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొండచరియలు విరిగిపడుతుండగా .. ఓ వ్యక్తి ఆ దృశ్యాలను ఫోన్ లో చిత్రీకరించాడు.
#WATCH Jammu-Srinagar Highway closed due to landslide at Hingni in Banihal area of Ramban district of Jammu and Kashmir. pic.twitter.com/gryMF5tR26
— ANI (@ANI) March 21, 2020