Girl Dies after eating Shawarma: కేరళలోని ఓ బేకరీలో 'షవర్మా' తిన్న ఓ 16 ఏళ్ల టీనేజ్ యువతి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో 35 మంది వరకు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటన కేరళలోని కసార్‌గడ్ జిల్లాలో చోటు చేసుకుంది.
మృతి చెందిన ఆ టీనేజ్ యువతిని దేవానందగా గుర్తించారు. కసార్‌గడ్ జిల్లాలోని కరివల్లూర్కి చెందిన ఆ టీనేజ్ యువతి కన్హన్‌గడ్‌లోని ఓ బేకరీలో షవర్మా తినడానికి వెళ్లింది. అక్కడ 'షవర్మా' తిన్న అనంతం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
అదే బేకరీలో షవర్మా తిన్న మరో 31 మంది కూడా ఆసుపత్రిపాలయ్యారు. వారంతా జ్వరం, డయేరియాతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని.. అందరి ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని జిల్లా వైద్యాధికారి డా.ఏవీ రాందాస్ తెలిపారు.
కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జి ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే దేవానంద చనిపోయి ఉంటుందని... ఇంతమంది అస్వస్థతకు గురయ్యారని అనుమానిస్తున్నారు. దీనికి కారణమైన ఆ బేకరీని అధికారులు సీజ్ చేశారు. బేకరీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Horoscope Today May 2 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారికి లవ్ బ్రేకప్ అయ్యే ఛాన్స్..
Also Read: ప్రశాంత్ కిశోర్ బిగ్ అనౌన్స్మెంట్... సొంత రాజకీయ పార్టీపై నేడే ప్రకటన...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook