droupadi murmu takes holy dip in Prayagraj triveni sangam video: ప్రయాగ్ రాజ్ కుంభమేళ పుణ్యస్నానాలు కన్నుల పండుగగా కొనసాగుతుంది. ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా యోగి సర్కారు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టింది. ఇదిలా ఉండగా కుంభమేళకు ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు హజరయ్యారు. మన దేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు షాహీ స్నానాలకు భారీగా తరలివస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా, కుంభమేళకు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వెళ్లారు. ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. రాష్ట్రపతి ముర్ముకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఎక్కడ కూడా భద్రతలో ఇబ్బందులు తలెత్తకుండా యోగి సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. సీఎం యోగి, గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ రాష్ట్రపతిని త్రివేణి సంగమంకు బోటులో తీసుకెళ్లారు.
#WATCH | Prayagraj, UP: President Droupadi Murmu takes a holy dip at Triveni Sangam during the ongoing Maha Kumbh Mela. pic.twitter.com/2PQ4EYn08b
— ANI (@ANI) February 10, 2025
అంతే కాకుండా.. ఆమె అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అక్కడ నదిలో పాలను వదిలి పూజలు చేశారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. బడే హనుమాన్ ఆలయంతో పాటు అక్షయవత్ వృక్షాన్ని దర్శించుకోనున్నారు. అదే విధంగా కుంభమేళలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్‌ను కూడా పరిశీలించబోతున్నట్లు సమాచారం.
Read more: Viral Video: పెళ్లిలో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తు స్టేజీ మీదనే కుప్పకూలీన యువతి.. వీడియో వైరల్..
ఇదంతా జరిగాక సాయంత్రం 5.55 గంటలకు ప్రయాగ్ రాజ్ నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. ఎక్కడ కూడా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తునే, సామాన్య భక్తులకు ఇబ్బందులు కల్గకుండా యూపీ సర్కారు కట్టుదిట్టైన భద్రత చేపట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter