Maharashtra Bus Accident మహారాష్ట్రలోని ముంబైలో శనివారం తెల్లవారుఝామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లాలో పాత ముంబై-పూణే హైవేపై కాలువలో బస్సు పడిపోవడంతో దాదాపు 12 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది.
పూణె నుంచి ముంబైకి సంగీత బృందంతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు తెల్లవారుజామున 4.50 గంటలకు శింగ్రోవా దేవాలయం సమీపంలోని హైవేపై లోయలో పడిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
గోరేగావ్‌కు చెందిన 'బాజీ ప్రభు వడక్ గ్రూప్'కు చెందిన సభ్యులు ఈ బస్సులో ఉన్నారు. పూణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి గోరేగావ్‌కు పయనమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు బస్సు వేదిక నుండి బయలుదేరింది. ఇక ఈ ప్రమాదంలో కనీసం 12 మంది మరణించారని, 27 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Also Read: Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్
మృతుల్లో ఎక్కువగా.. సియోన్, గోరేగావ్, పాల్ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతాలకు చెందినవారేనని రాయ్‌ఘడ్ ఎస్పీ సోమనాథ్ ఘర్గే తెలిపారు. గాయపడిన వారిని.. ఖోపోలి గ్రామీణ ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. మృతుల వయస్సు ఎక్కువగా.. 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పుకొచ్చారు. స్థానిక పోలీసుల బృందం, ట్రాకర్ల బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉంది. ఖోపోలి అనే ఈ పట్టణం ముంబై నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook