NEET UG 2025 Exam: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రతి ఏటా ఎన్టీఏ నిర్వహిస్తుంటుంది. గత ఏడాది నీట్ యూజీ 2024 పరీక్షలో నెలకొన్న అవకతవకల నేపధ్యంలో ఈసారి నీట్ పరీక్ష ఏ విధానంలో జరుగుతుందనే సందేహాలకు ఎన్టీఏ తెర దించింది. ఈసారి నీట్ పరీక్షను పెన్, పేపర్ విధానంలోనే నిర్వహించనున్నామని తెలిపింది.
దేశవ్యాప్తంగా బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంటుంది. అయితే గత ఏడాది నీట్ యూజీ 2024 పరీక్షలో నెలకొన్న అవకతవకల నేపధ్యంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నీట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో రెండు దశల్లో నిర్వహించాలని సూచించింది. దీంతో ఈసారి నీట్ పరీక్ష ఎలా జరుగుతుందనే సందేహాలు నెలకొన్నాయి. కానీ ఎన్టీఏ ఈ సందేహాలకు తెర దించింది. నీట్ పరీక్షను ఈసారి కూడా పెన్ , పేపర్ విధానంలోనే నిర్వహిస్తామని వెల్లడించింది. అది కూడా ఒకే దశలో నిర్వహిస్తామని వివరించింది. ఎన్టీఏ ప్రకటనతో నీట్ యూజీ 2025 పరీక్షపై నెలకొన్న సందిగ్దత తొలగింది.
అదే విధంగా మిలిటరీ నర్శింగ్ సర్వీసులో భాగంగా బీఎస్సీ నర్శింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ పరీక్ష పాస్ కావల్సి ఉంటుంది. ఇది నాలుగేళ్ల కోర్సు. ఈ కోర్సు చేసినవారికి ఆర్మీ ఆసుపత్రుల్లో నర్శులుగా చేసే అవకాశం కలుగుతుంది. నీట్ యూజీ పరీక్ష రాసే విద్యార్ధులు ఈలోగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. అప్పుడే నీట్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియ సులభతరమౌతుంది.
Also read: Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన, చలితో జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.