PM Narendra Modi meet with Chief Ministers: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనాసాగుతూనే ఉంది. నిత్యం 90వేలకు పైగా కరోనా కేసులు, 1100లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) సమావేశం కానున్నారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఈనెల 23న జరుగుతుందని సమాచారం. ఆయా రాష్ట్రాల్లో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అదేవిధంగా పలు అంశాలపై ప్రధానమంత్రి మోదీ సీఎంలతో చర్చిస్తారని తెలుస్తోంది. అయితే సమావేశం, ఏయే రాష్ట్రాల సీఎంలతో ప్రధాని చర్చిస్తారన్న వివరాలను పీఎంవో ఇంకా అధికారికంగా వెల్లడించాల్సిఉంది. దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (AP), తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రాల్లోనే దాదాపు 60శాతానికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంపై ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే చివరిసారిగా మోదీ ఆగస్టు 11న 10 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. Also read: AstraZeneca Vaccine: భారత్‌లో మళ్లీ ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్
ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 54,00,619 కి చేరుకోగా.. మరణాల సంఖ్య 86,752 కి పెరిగింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 10,10,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కేసులు పెరుగుతున్న కొద్ది రికవరీ రేటు కూడా దేశంలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా రికవరి రేటు 79.68 శాతం ఉండగా.. మరణాల రేటు 1.61 శాతం ఉంది. Also read: MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ