Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్‌లో గందరగోళం నెలకొంది. ఇటీవల ఆయన మహారాష్ట్ర రాజధాని ముంబైలో పర్యటించారు. ఈసందర్భంగా అమిత్ షా టూర్‌లో భద్రతా వైఫల్యం బయటపడిందని తాజాగా పోలీసులు తెలిపారు. హోం శాఖ ఆఫీసర్‌నని చెప్పుకుంటూ..అమిత్ షా వెంట తిరిగిన వ్యక్తిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇటీవల ఆయన రెండురోజులపాటు ముంబైలో పర్యటించారు.
ఈసందర్భంగా బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై మంతనాలు జరిపారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. పార్టీ బలోపేతం అయ్యేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా..ఆ పర్యటనలో అనుకోని వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతడిని గుర్తించడంలో అధికారులు, పోలీసులు విఫలమయ్యారు. స్పష్టంగా భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ వ్యక్తి హోం మంత్రిత్వ శాఖ ఐడీ కార్డు ధరించి భద్రతా బృందంలో సంచరించాడు.
కొన్ని గంటలపాటు కేంద్రమంత్రి అమిత్ షా చూట్టూ తిరిగాడు. అక్కడే చక్కర్లు కొడుతూ..ఇతర అధికారులతో మాట్లాడుతున్న విజువల్స్ కనిపించాయి. ఐనా అతడి తీరుపై అనుమానం రావడంతో ముంబై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అతడి పేరు హేమంత్ పవార్‌గా గుర్తించారు. భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేనట్లు పోలీసులు గుర్తించారు.
ఆ వెంటనే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం ఐదురోజులపాటు కస్టడీకి తరలించారు. తాను ఆంధ్రప్రదేశ్ ఎంపీ అనుచరుడినని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే అతడు ఏ ఎంపీ పేరు చెప్పకపోవడంతో పలు అనుమానాలు కల్గుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే సీఎంగా, బీజేపీ నేత ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైయ్యాక అమిత్ షా తొలిసారి ముంబైలో పర్యటించారు. ఇటీవల దేశ ప్రధాని టూర్‌లో భద్రతా వైఫల్యం కనిపించింది. పంజాబ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్న ప్రధానికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. దీంతో ఆయన బ్రిడ్జిపై ఉండిపోవాల్సి వచ్చింది. దీనిపై అప్పట్లో పెను దుమారం రేగింది. దేశ ప్రధానికే రక్షణ లేకుండా పోయిందన్న విమర్శలు వచ్చాయి.
Also read:Ganesh Immersion 2022: గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం..ఆ మూడు జిల్లాల్లో రేపు సెలవు..!
Also read:Jharkhand: లోదుస్తుల కోసం ఢిల్లీకి వెళ్లా..సీఎం హేమంత్ సోరెన్ సోదరుడి వివాదాస్పద వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి