Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈకేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. అంశాన్ని ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ధర్మాసనం తెలిపింది.
ఈకేసు తదుపరి విచారణను హైకోర్టు చేపడుతుందని..ఎలాంటి చర్యలు తీసుకోవాలో కోర్టే నిర్ణయిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సిర్పుర్కర్ కమిషన్ నివేదిక పలు సూచనలు చేసిందని.. చట్టం ప్రకారం హైకోర్టు ముందుకు వెళ్తుందని పేర్కొంది. హైకోర్టులో, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదని..కోర్టుకు నివేదిక పంపుతామని తెలిపింది. దేశవ్యాప్తంగా దిశా కేసు సంచలనం సృష్టించిందని ఈసందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.
నివేదిక చూడకుండా కేసులో వాదోపవాదనలు వినడం..నేరుగా పరిశీలించడం సర్వోన్నత న్యాయస్థానానికి సాధ్యంకాదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ న్యాయవాదులు చర్చించాలని తెలిపింది. దిశా ఎన్‌కౌంటర్ ఘటన అనంతరం ఘటనపై కమిషన్‌ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. సిర్పుర్కర్, రేఖ ప్రకాష్, కార్తికేయన్‌లతో కూడిన త్రిసభ్య కమిషన్ ఏర్పాటు అయ్యింది.
దాదాపు మూడేళ్ల పాటు కమిషన్ విచారణ చేసింది. తెలంగాణ హైకోర్టు కేంద్రంగా విచారణ జరిపింది. పోలీసు ఉన్నతాధికారులు, సాక్ష్యులు, బాధిత కుటుంబసభ్యులతో దిశా కమిషన్ విచారించింది. ఘటనాస్థలిని సైతం కమిషన్ సభ్యులు పరిశీలించారు. అక్కడి పరిస్థితిని ఆరా తీశారు. ఎన్‌కౌంటర్‌లో ఉన్న పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను పలుమార్లు ప్రశ్నించింది కమిషన్.
Also read:NTR 31 Movie Poster: ఉగ్రరూపంలో తారక్.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వచ్చేసింది!
Also read:Tsrtc Cuts Driver Salary : మైలేజీ తగ్గిందని డ్రైవర్ జీతంలో కోత.. ఆర్టీసీ వింత పోకడ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook