Pegasus spyware: నిఘా దేశంగా మార్చుతున్నారా ? కేంద్రంపై మమతా విమర్శలు

Pegasus spyware: పెగసస్ స్పైవేర్. ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఆందోళన రేగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 22, 2021, 08:59 AM IST
Pegasus spyware: నిఘా దేశంగా మార్చుతున్నారా ? కేంద్రంపై మమతా విమర్శలు

Pegasus spyware: పెగసస్ స్పైవేర్. ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఆందోళన రేగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇజ్రాయిల్‌(Izrael)కు చెందిన పెగసస్ స్పైవేర్(Pegasus spyware)దేశంలో పెద్దఎత్తున ఆందోళన కల్గిస్తోంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా ప్రమాదకరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఆమె విమర్శలు చేశారు.దేశంలో సంక్షేమానికి బదులుత నిఘా దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు అందరిపై నిఘా పెట్టినందుకు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని మమతా బెనర్జీ కోరారు. 

పెగాసస్‌ స్పైవేర్‌ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని(Modi government)గద్దె దింపేయాలని, ఇందుకోసం విపక్షాలు అన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. విపక్ష నేతల ఫోన్ సంభాషణలు రికార్డు అవుతున్నాయని..అందుకే ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత చిదంబరం, ఇతర ముఖ్యమంత్రులతో మాట్లాడలేకపోతున్నట్టు మమతా తెలిపారు. ఇలాంటి నిఘా వ్యవహారాలతో బీజేపీను 2024లో ఓటమి నుంచి తప్పించలేరని ఎద్దేవా చేశారు.పెగసస్ స్పైవేర్ ప్రమాదకరమైందని..అందుకే తన కెమేరాకు ప్లాస్టర్ వేశానంటూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వానికి ప్లాస్టర్ వేయాలని..లేకపోతే దేశమే సర్వనాశమవుతుందని మమతా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన న్యాయవ్యవస్థ, ఎన్నికల కమీషన్, మీడియాలు పెగసస్ వలలో చిక్కుకున్నాయని ఆరోపించారు. జాతి ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు(Supreme Court)ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారించాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. 

Also read: First bird flu death case: బర్డ్ ఫ్లూతో బాలుడు మృతి.. దేశంలో తొలిసారిగా మనిషికి బర్డ్ ఫ్లూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News