జేఎన్‌యూలో యూట్యూబ్‌ బ్యాన్..?

   

Last Updated : Nov 12, 2017, 04:18 PM IST
జేఎన్‌యూలో యూట్యూబ్‌ బ్యాన్..?

జవహన్ లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్థులు తమ హాస్టల్ క్యాంపస్లో ఉన్న వైఫై కనెక్షన్‌ను యాజమాన్యం ఒక రోజు ఆపుచేసి, ఆ తర్వాత యూట్యూబ్‌తో పాటు పలు వెబ్ పేజీలను యాక్సెస్ చేయకుండా బ్యాన్ విధించిందని తెలిపారు. అయితే, వారి మాటల్లో నిజం లేదని యూనివర్సిటీ రెక్టార్ ప్రకటన జారీ చేశారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే విద్యార్థులకు ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తున్నామని అందులో పేర్కొన్నారు. అయితే జేఎన్‌యూ విద్యార్థుల సంఘ సభ్యులు ఏదో రాజకీయ లబ్ధి కోసమే యూనివర్సిటీ కొన్ని వెబ్ సైట్లు బ్యాన్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు కన్నయ్య కుమార్, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ లాంటి పదాలు గూగుల్‌లో టైపు చేస్తున్నప్పుడు పేజీలు లోడ్ కావడం లేదని.. యాక్సెస్ డినైడ్ సందేశం వస్తుందని.. ఆయా పేజీలను యూనివర్సిటీ బ్యాన్ చేసిందని తెలిపారు. యూనివర్సిటీ తీసుకుంటున్న చర్యలు విద్యార్థుల హక్కులను హరించేవిధంగా ఉన్నాయని.. ఇప్పటికే పలువురు విద్యార్థులు వాపోతున్నారు. అయితే యూనివర్సిటీకి సంబంధించిన యూఆర్‌ఎల్ ఫిల్టరింగ్ పాలసీ మాత్రం నిబంధనలకు అనుణంగా ఉందని రెక్టార్ తెలియజేయడం గమనార్హం.

 

Trending News