BBC Documentary Screening in HCU: ఒకే భావజాలం కలిగిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఓ), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) విద్యార్థి సంఘాలు బిబిసి డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసినట్టు తెలుసుకున్న యూనివర్శిటీ యాజమాన్యం.. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించింది.
Documentary Screening on PM Modi: యూనివర్శిటీ అనుమతి లేకుండా ప్రదర్శిస్తున్న ఈ డాక్యుమెంటరనీ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని యూనివర్శిటీ రిజిస్ట్రార్ తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. యూనివర్శిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శన యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజిస్ట్రార్ స్పష్టంచేశారు.
జేఎన్‌యూ విద్యార్థి నేత, కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ (Umar Khalid Arrested) చేశారు. సుదీర్ఘంగా ఉమర్ ఖలీద్‌ను పోలీసులు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
సీపీఐ యువనేత కన్నయ్య కుమార్ కాన్వాయ్‌పై మరోసారి దాడి జరిగింది. బీహార్‌లోని అర్రాలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో కన్నయ్య కుమార్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ధ్వంసం కాగా కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న వారిలో కొంత మందికి గాయాలయ్యాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ ప్రపంచ ర్యాంకింగ్ లో 10 స్థానాలకు పడిపోయిందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు.
రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దాడికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి సందర్భంగా ఓ విద్యార్థి తీసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడా వీడియో ఆధారంగా పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ.. JNUలో నిన్న రాత్రి భయానక వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని దుండగులు ముసుగులు వేసుకుని క్యాంపస్‌లోకి ప్రవేశించారు. చేతుల్లో కర్రలు, రాడ్లతో లోపలికి వచ్చిన దుండగులు .. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ వామపక్ష విద్యార్థి నేత కన్నయ్య కుమార్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ ఆహుజా శనివారం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఆరాధించే హనుమంతుడిని ప్రపంచంలోనే తొలి గిరిజన నాయకుడిగా ఆయన అభివర్ణించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.