Amla VS Blueberry Benefits: ఉసిరికాయలు కూడా విటమిన్ సి ఉంటుంది. ముఖానికి రంగు ఇస్తుంది.. బ్లూబెర్రీ లేదా ఉసిరి రెండిటిలో ఏ పండు తింటే మీ చర్మానికి రెట్టింపు గ్లో వస్తుందో తెలుసుకుందాం. ముందుగా ఏవైనా ఆహారాలు మీ డైట్ లో చేర్చుకుంటే అవి మీ స్కిన్ టైపు కి సరిపోతాయా? లేదా? చూసుకోవాలి.. బ్లూబెర్రీ లేదా ఉసిరి మీకు రెండిటిలో ఏ పండు సరిపోతుంది చెక్ చేసుకోవాలి.
బ్లూ బెర్రీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మంట, వాపు సమస్యను తగ్గిస్తుంది. మీ చర్మం అందంగా కనిపిస్తుంది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్లూబెర్రీ పండ్లు తింటే షుగర్ వ్యాధి గ్రస్థులకు కూడా మేలు చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. అయితే, ఉసిరి హెయిర్ కేర్ రొటీన్‌లో ఉపయోగిస్తారు. కానీ, వీటిని మనం తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా.. అందంగా కనిపిస్తుంది. త్వరగా మీ ముఖంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి.
ఇక ఉసిరి విషయానికి వస్తే ఆయుర్వేద పరంగా ఎన్నో ఏళ్ల నుంచి ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అందుకే మన డైట్ లో చేర్చుకోవడం వల్ల అనే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇదీ చదవండి: మీ చర్మం నిత్య యవ్వనంగా కనిపించేలా ప్రేరేపించే 6 డ్రింక్స్.. తాగితే మ్యాజికల్ బెనిఫిట్స్..
బ్లూ బెర్రీ పండ్లను డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. దీంతో చర్మానికి పొడిబారే సమస్య రాదు. బ్లూబెర్రీస్ తినడం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా మీ దరిచేరవు. అయితే ఉసిరికాయలు కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బ్లూబెర్రీల కంటే ఉసిరిలో ఎక్కువగా విటమిన్ సీ ఉండటం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
అయితే బ్లూబెర్రీ పండ్లు యాక్నే ఎక్కువగా ఉండే సెన్సిటివ్ స్కిన్ కి నప్పుతాయి. ఇక ఉసిరి విషయానికి వస్తే వృద్ధాప్య సమస్యలు త్వరగా రాకూడదు అనేవారికి కొద్దిగా వయసు మీద పడుతున్న వారికి బ్లూబెర్రీలు తినడం మంచిది..
ఇదీ చదవండి: అనుకున్నంత పని అయింది.. దాసు ప్రాణాలు తీయాలని తలపగులగొట్టిన జ్యోత్స్న.. ఆసుపత్రిలో శౌర్య సీరియస్..
బ్లూబెర్రీ లేదా ఉసిరి రెండిటిలో ఏ స్కిన్ వారికి ఏది మంచిది. అంటే బ్లూబెర్రీ యాక్నే ఉన్నవాళ్లు కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పటం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. యాక్నే ఉన్న వారి చర్మానికి బ్లూబెర్రీ మంచిది. వీటిని స్నాక్ మాదిరి తీసుకోవచ్చు. వీటిని తరచూ తినడం వల్ల అందం, ఆరోగ్య ప్రయోజనం కూడా పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.