Home Remedies For Cockroaches in Home: పరిశుభ్రత లోపం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా మంది ఇళ్లలో బొద్దింకలు వ్యాపించడం, దోమలు రావడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వీటి వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారికి చాలా ప్రమాదకరం. దీని వల్ల వారికి దీర్ఘకాలిక వ్యాధుల కూడా సోకే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా బొద్దింకల నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిది. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల స్ప్రేలు, రసాయనాలతో కూడిన మందులున్నాయి. వీటి వల్ల బొద్దింకల నుంచి ఉపశమనం లభించిన మానవులకు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ 5 చిట్కాలు పాటిస్తే పెస్ట్‌ను కంట్రోల్ పెట్టొచ్చు.
బొద్దింకలను ఎలా వదిలించుకోవాలి:
- ప్రస్తుతం శుభ్రత లేకపోవడం వల్ల చాలా మంది ఇళ్లలోని వంటగదిలో బొద్దింక వ్యాపిస్తున్నాయి. అయితే దీని నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి..స్ప్రే బాటిల్‌లో కిరోసిన్ ఆయిల్ నింపండి. తర్వాత రాత్రి పూట వాటిపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా మీరు మంచి ఫలితాలు పొందొచ్చు.
- బొద్దింకలను నుంచి విముక్తి పొందడానికి మరో పద్ధతి కూడా ఉంది. కాఫీ పొడిని తీసుకుని ఓ తెల్ల గుడ్డలో చుట్టి, బొద్దింకలు వచ్చే ప్రదేశంలో ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వాటి నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!
- ఈ బే ఆకులను చాలా మంది వంటకాల రుచి పెంచడానికి సహాయపడుతుంది. అయితే బే ఆకులు వాసన వల్ల బొద్దింకలు సులభంగా దూరమవుతాయి. దీని కోసం మీరు ఈ ఆకులను తీసుకుని వంటగదిలో అక్కడక్క ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దోమల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
- వేప నూనె వల్ల కూడా బొద్దింకలను పారిపోయేలా చేయోచ్చు. దీని కోసం మీరు ఒక గిన్నెలో రెండి టెబుల్ స్పూన్ల తేనె తీసుకుని అందులో 10-12 లవంగాలను వేసి బొద్దింకలు ఉండే చోట పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా అవి పారిపోతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook