Ginger Benefits: రోజూ పరగడుపున అల్లం రసం తాగితే..నాలుగు వారాల్లోనే జీరో వెయిట్

Ginger Benefits: అధిక బరువు ఇటీవలికాలంలో ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల్లం రసం ఎప్పుడైనా ట్రై చేశారా..అల్లం రసంతో కలిగే అద్భుతాలు ఇప్పుడు చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 14, 2022, 10:14 PM IST
Ginger Benefits:  రోజూ పరగడుపున అల్లం రసం తాగితే..నాలుగు వారాల్లోనే జీరో వెయిట్

Ginger Benefits: అధిక బరువు ఇటీవలికాలంలో ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల్లం రసం ఎప్పుడైనా ట్రై చేశారా..అల్లం రసంతో కలిగే అద్భుతాలు ఇప్పుడు చూద్దాం..

ఆయుర్వేద వైద్యశాస్త్రంలో అల్లంకు విశేష ప్రాధాన్యత ఉంది. కేవలం కూరల్లోనే కాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు అల్లం విశేషంగా వినియోగిస్తారు. అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. పరగడుపున ప్రతిరోజూ ఉదయం అల్లం రసం తాగితే చాలా ప్రయోజనాలున్నాయి. అల్లం రసంతో కలిగే ఆ ప్రయోజనాలేంటో చూద్దాం..

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపున అల్లం రసం తాగితే బరువు తగ్గడమే కాకుండా..శరీరం మెటబోలిజం కూడా మెరుగవుతుంది. ఫలితంగా రోజంతా మనిషి యాక్టివ్‌గా ఉంటాడు. రోజూ పరగడుపున అల్లం రసం తాగడం వల్ల చర్మానికి కూడా చాలా మేలు చేకూరుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పలు సమస్యల్నించి దూరం చేయడమే కాకుండా..చర్మంపై పింపుల్స్, యాక్నే, మొటిమలు వంటివి రాకుండా కాపాడుతుంది. వాపు దూరం చేసేందుకు కూడా అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందుకు ఉపయోగపడతాయి.

అల్లం రసం తయారీ కూడా చాలా సులభం. ఒక గ్లాసు నీళ్లలో అల్లం ముక్క వేసి బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత వడపోసి..అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడమే. లేదా కొద్దిగా అల్లం ముక్కను క్రష్ చేసి పిండితే రసం వస్తుంది. ఆ రసం నేరుగా తాగినా లేదా కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని తాగినా మంచి ఫలితాలుంటాయి.

Also read: Health Tips: ఈ గింజలను అతిగా తింటే.. డైరెక్ట్‌ కోమాలోకి వెళ్తారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News