High Blood Pressure: ప్రస్తుతం చాలామంది జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. అయితే ఈ మార్పుల కారణంగా శరీరంలో తీవ్రవాదులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సైలెంట్ కిల్లర్ రూపంలో ఉండే దీర్ఘకాలిక వ్యాధులు మొదలుకొని చర్మవ్యాధులు దాకా చాలా రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీవనశైలి మార్పులలో భాగంగా ప్రస్తుతం ప్యాకేజ్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం కారణంగా చాలామందిలో సైలెంట్ గా అధిక రక్తపోటు సమస్యలు శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.
Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్
అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి. అధిక రక్తపోటు కారణంగా శరీరంలో తీవమార్పుల సంభవించి.. గుండెపోటు సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ఆహారంలో మార్పులే కాకుండా ఆరోగ్యకరమైన అలవాట్ల కారణంగా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రతిరోజు డైట్ పద్ధతిలో మాత్రమే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డైట్ లో భాగంగా డ్రై ఫ్రూట్స్ సీడ్స్ తో పాటు గ్రీన్ వెజిటేబుల్స్, బ్రౌన్ రైస్ పోషకాలు అధిక పరిమాణంలో ఉండే వంటి ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరం యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు రెండుసార్లు గ్రీన్ టీ ని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు వ్యాయామాలు చేయడం వల్ల కూడా రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు 25 నుంచి 30 నిమిషాల చొప్పున వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి