Spinach Juice Benefits In Telugu: చాలామంది పాలకూరను తినేందుకు అంతగా ఇష్టపడరు.. ఎందుకంటే ఇది ఎలాంటి రుచి లేనప్పటికీ.. తినడానికి కాస్త మట్టి మట్టిగా వాసన వస్తుంది. అందుకే చాలామంది పిల్లలు పెద్దవారు తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపరు. నిజానికి పాలకూరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు సహాయపడతాయి. అయితే పాలకూర తినని వారు దానిని జ్యూస్లా తయారు చేసుకుని తాగడం వల్ల మరెన్నో అద్భుతమైన లాభాలు పొందుతారు. దీనిని జ్యూస్‌లా తీసి తాగడం వల్ల అందులో లభించే పోషకాలు కంటి సమస్యల నుంచి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల వరకు పనిచేస్తాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాలకూర రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
కళ్ళ ఆరోగ్యం:
పాలకూర రసంలో శరీరానికి కావలసిన విటమిన్స్ అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి కంటి సమస్యలతో బాధపడుతున్న వారు రోజు రాత్రి ఒక గ్లాసు చొప్పున ఈ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా రేచీకటి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు రోజుకు రెండుసార్లు ఈ రసాన్ని తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
రక్తహీనత నివారణ:
ప్రస్తుతం చాలామంది స్త్రీలు శరీరంలోని పోషకాల విలువలు తగ్గిపోవడం కారణంగా రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే ఈ సమస్య బారిన సులభంగా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో పాలకూర రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:
పాలకూరలో ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది కాబట్టి రోజు ఉదయం పూట ఈ రసాన్ని తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా మలబద్దకం అజీర్ణం ఇతర పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయి.
చర్మం ఆరోగ్యం:
పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని క్లీన్ గా ఉంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. తరచుగా ముడతలు మచ్చలతో బాధపడుతున్న వారు రోజు ఉదయం పూట పాలకూర రసాన్ని తాగడం వల్ల తొందర్లోనే వాటికి చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా వృద్ధాప్య చర్మాన్ని కూడా తగ్గించవచ్చు.
గుండె సమస్యలకు చెక్:
పాలకూర రసంలో కాస్త పొటాషియం కూడా ఉంటుంది. దీని కారణంగా ఈ రసాన్ని తాగడం వల్ల ఎలాంటి గుండె సమస్యలు అయినా తొలగిపోతాయి అలాగే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారు తప్పకుండా పాలకూర రసాన్ని తాగాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది:
పాలకూర రసంలో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు అన్ని రకాల క్యాన్సర్లు రాకుండా రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ తీసుకునే సలాడ్స్ లో పాలకూర రసాన్ని తాగడం కూడా ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రసం శరీర బరువును తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.