Tulsi Tea Benefits: తులసి టీ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Tulsi Tea Benefits: తులసిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో, తులసి టీ తాగడం వల్ల కూడా చాలా అన్నే లభాలున్నాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 15, 2022, 03:50 PM IST
  • తులసి టీ వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు
  • జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది
  • మంచి నిద్ర కోసం తులసి టీ తప్పకుండా తాగండి
Tulsi Tea Benefits: తులసి టీ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Tulsi Tea Benefits: తులసిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో, తులసి టీ తాగడం వల్ల కూడా చాలా అన్నే లభాలున్నాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. వాస్తవానికి ఇందులో యాంటీవైరస్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం వంటి ముఖ్యమైన ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక సమస్యల నుంచి దూరంగా ఉంచుంది.

ఈ సమస్యల నుంచి ఉపశమనం:

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి తులసి టీ చాలా మేలు చేస్తుంది. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా ప్రజలు కలుష్యపు ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తులసి టీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టీ వల్ల మల విసర్జన ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా గ్యాస్ సమస్య, విరేచనాలు, కడుపులో తిమ్మిర్లు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

మంచి నిద్ర కోసం తులసి టీ తప్పకుండా తాగండి:

మంచి నిద్ర కోసం తులసి టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఒత్తిడి, నూతన జీవనశైలి కారణంగా ప్రజలు నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో మంచి నిద్ర కోసం తులసి టీ తాగవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)

Also Read: Juices For Diabetes Patients: మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రిక్స్‌ ట్రై చేయండి..!

Also Read: Health Care Tips: ఆహారం తిన్న తర్వాత ఈ వ్యాయామాలు చేయండి.. ఇలా చేస్తే అన్ని సమస్యలు మటు మాయం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News