Weight Loss In 7 Days: చలి కాలంలో త్రిఫల చూర్ణంతో 7 రోజుల్లో బరువు తగ్గడం ఎలాగో తెలుసా?

Triphala Churna For Weight Loss In 7 Days: త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2023, 03:52 PM IST
Weight Loss In 7 Days: చలి కాలంలో త్రిఫల చూర్ణంతో 7 రోజుల్లో బరువు తగ్గడం ఎలాగో తెలుసా?

 

Triphala Churna For Weight Loss In 7 Days: వంటగదిలో వినియోగించి సుగంధ ద్రవ్యాల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి. సుగంధ ద్రవ్యాల్లో కీలక పాత్ర పోషించే త్రిఫలను క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. క్రమం తప్పకుండా గోరు వెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలుపుకుని తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

బరువు తగ్గడానికి:
త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు తప్పకుండా త్రిఫల చూర్ణం కలిపిన నీటిని తాగాల్సి ఉంటుంది. 

జీర్ణ శక్తిని మెరుగుపరుచుతుంది:
త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఎసిడిటీ నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభించి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

హార్మోన్ల సమస్యలకు చెక్‌:
త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల హార్మోన్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వాత, పిత్త, కఫా సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
త్రిఫల చూర్ణంలో విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రోజు శీతాకాలంలో వినియోగించడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News