White Hair To Black Hair: చాలామందిలో జుట్టు సమస్యలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. జుట్టు రాలడంతో పాటు తెల్ల జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు వాతావరణ కాలుష్యం, శరీరంలోని పోషకాలలోపమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు మార్కెట్లో లభించే హెయిర్ డైలను తరచుగా వినియోగిస్తూ ఉంటారు.. వీటిని వినియోగించడం వల్ల కేవలం 20 రోజుల నుంచి 30 రోజుల వరకే జుట్టు నల్లగా కనిపిస్తుంది ఆ తర్వాత ఎప్పటిలాగా తెల్లగా తయారవుతోంది.
అయితే శాశ్వతంగా తెల్ల జుట్టును నల్ల జుట్టు గా తయారు చేసుకోవడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. సాధారణంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో లభించే బిళ్లగన్నేరు మొక్క జుట్టుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టును నల్లగా తయారుచేసి జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే బిళ్లగన్నేరు మొక్కను జుట్టుకు ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!
ఈ మొక్క నుంచి ఆకులను వేరు చేసి.. ఆ తర్వాత ఆకులను శుభ్రం చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకులను గ్రైండర్ లో వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఇదే మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, అర చెక్క నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అరగంట సేపు పక్కన పెట్టుకొని వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ఈ మిశ్రమాన్ని వినియోగించే పద్ధతి:
ఈ మిశ్రమాన్ని అప్లై చేసే రెండు గంటల ముందు తలస్నానం చేయాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న బిళ్లగన్నేరు ఆకుల మిశ్రమాన్ని ఒక కాటన్ గుడ్డతో జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత జుట్టును సాధారణ షాంపుతో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెమెడీని వారానికి ఒకసారి వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీనిని వినియోగించడం వల్ల జుట్టు రాలడం సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మిశ్రమాన్ని ఒకసారి ట్రై చేయండి.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి