Banana Facts: అరటిపండు తింటే యమ డేంజర్.. ఎందుకో తెలుసా?

Banana Facts These Persons No To Banana: నిత్యం అందుబాటులో ఉండే చవకగా లభించే పండు అరటి. చవక అని తీసిపారేయకండి యాపిల్‌ పండు కన్నా అధికంగా ఎన్నో పోషకాలు అరటిపండు కలిగి ఉంటుంది. అయితే అరటి పండు కొన్ని వ్యాధులు ఉన్నవారు మాత్రం అస్సలు తినవద్దు.

1 /8

అరటి పండు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. మానవ దేహానికి ఎన్నో పోషకాలను అందిస్తూ ఆరోగ్యంగా ఉంచుతోంది.

2 /8

అరటి పండులో విటమిన్‌ బీ6, విటమిన్‌ సీ, ఫైబర్‌, పొటాషియం, మాంగనీస్‌ ఉంటాయి. అంతేకాకుండా గ్లూటాతియోన్‌, ఫినాలిక్స్‌, డెల్ఫిడిన్‌, నరింగిన్‌ వంటి యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కానీ కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారికి అరటి పండు శత్రువుగా ఉంటుంది.

3 /8

కిడ్నీ వ్యాధి: అరటిపండ్లను దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధులతో బాధపడేవారు తినరాదు. అరటిలో ఉండే అధిక మొత్తంలో పొటాషియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.

4 /8

జీర్ణ సమస్య: జీర్ణ సమస్యలు ఉంటే అరటి పండును తినవద్దు. అరటిలో ఉండే పీచు పదార్థం ఎక్కువగా తీసుకుంటే కొన్ని రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

5 /8

అధిక రక్తపోటు: అరటిపండులో ఉండే పొటాషియం బీపీ బాధితులకు చేటు చేస్తుంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు తినకుంటే మంచిది.

6 /8

మధుమేహం: సహజంగా లభించే చక్కెర అరటిలో అధికంగా ఉంటుంది. అరటి తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మధుమేహం బాధితులు అరటిపండ్లను తినవద్దు.

7 /8

అలర్జీ: కొంతమందికి కొన్ని పండ్లు తింటే అలర్జీలు వస్తాయి. కొందరికి అరటి పండు తింటే కూడా అలర్జీ వస్తుంది. అలాంటి వారు తినవద్దు.

8 /8

సూచన: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఇచ్చినది. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారానికి జీ మీడియా ఎలాంటి బాధ్యత వహించదు.