Spitting Red King Cobra Snake Video Watch Here: కొన్ని అరుదైన జాతులకు సంబంధించిన పాములు మన భూమిపై ఇంకా బ్రతికి ఉన్నాయని చాలామందికి తెలియదు. అయితే కొంతమంది స్నేక్ క్యాచర్స్ అడవుల్లో సంచారం చేసేటప్పుడు వారికి కనిపించిన అరుదైన పాములకు సంబంధించిన వీడియోలను ఇంటర్నెట్లో షేర్ చేస్తూ ఉంటారు.. ఇందులో భాగంగానే ఓ అరుదైన జాతి పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి పాములు ఇలా కూడా ఉంటాయని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. మనం ఇప్పటికి సాధారణ పాములను మాత్రమే చూస్తుంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అరుదైన జాతులకు సంబంధించిన అతి ప్రమాదకరమైన పాములను కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఎప్పుడైనా ఎరుపు రంగుతో కూడిన అరుదైన అతి భయంకరమైన పామును చూశారా? చూడని వారు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే..
సాధారణంగా గతంలో ఎన్నో రకాల అరుదైన పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి అందులో భాగంగా ఒక ఎరుపు రంగుతో కూడిన ఓ పాముకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇటీవలే రెడ్ కలర్ మరో పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన షార్ట్ యూట్యూబ్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. మనం ముందుగా ఓ ఎరుపు రంగుతో కూడిన కింగ్ కోబ్రా చూడవచ్చు. ఈ పాము కేవలం ముసలి కొడుతూ అటు ఇటు చూడడం మీరు గమనించవచ్చు. కానీ ఈ పాము కు సంబంధించిన అసలైన నిజ స్వరూపం ఇంకోటి ఉంది. అదేంటంటే తనను దాడి చేయడానికి వచ్చిన వారి కళ్ళల్లోకి విషం చిమ్మి చంపేయడం.. అవును ఈ పాము కళ్ళల్లోకి నేరుగా విషాన్ని చిమ్ముతుంది.
AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు
ఈ పాము కళ్ళల్లోకి విషం చిమ్మితే డైరెక్టుగా గుడ్డివారవ్వాల్సిందే. ఆ తర్వాత ఈ పాము నెమ్మదిగా శత్రుపై దాడి చేసి మరణించేలా చేస్తుంది. అన్ని పాములల్లోకెల్లా ఈ పాము చాలా అరుదైన జాతని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని పాములు మాత్రమే ఇలాంటి ఉన్నాయని వారంటున్నారు. నిజానికి మనం విషాన్ని చిమ్మే పాములను చూసి ఉంటాం.. కానీ ఈ పాము మాత్రం భారీ మొత్తంలో విషాన్ని చిమ్ముతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను @theworldtour123 అని యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోకు కొన్ని వందలకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాకుండా కొన్ని లక్షల మంది వీక్షించినట్లు తెలుస్తోంది.
AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి