World in 2020 | కరోనావైరస్ నుంచి ఎగిరే పళ్లాల వరకు ఈ సంవత్సరంలో అన్నీ చూశాం. లాక్డౌన్, అన్లాకింగ్ .. వ్యాక్సిన్ కోసం పోరు...అన్నింటినీ ఫేస్ చేశాం. వీటితో పాటు ఈ సంవత్సరం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి. అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.
2020 సంవత్సరం ఎన్నో ఆటుపోట్లతో నిండిన ప్రపంచం. ప్రపంచంలో కోట్లాది మంది ఇంట్లోనే అత్యధిక సమయం గడిపిన సమయం ఇది. అయితే కోవిడ్-19 మహమ్మారితో పాటు మరిన్ని అరుదైన, వింతైన ఘటనలు ఎన్నో జరిగాయి ఈ సంవత్సరం. అమెరికా నుంచి నార్త్ కొరియా వరకు ఊహకందని విషయాలు జరిగాయి. ఇలా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఐదు ఘటనలు ఇవే.
Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే
కరోనా మహమ్మారి
కరోనావైరస్ (Coronavirus) కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసింది. కొన్ని మిలియన్ల మంది కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. వేలాది పరిశ్రమలు ఇంకా ఎప్పుడూ తెరుచుకోని విధంగా నష్టపోయాయి.
కిమ్ ఏమయ్యాడో..
కిమ్ ఏమయ్యాడో ... ఈ ప్రశ్న ఈ సంవత్సరం ఎక్కువగా వినిపించిన ప్రశ్న. అమెరికా పెంటగాన్ నుంచి అమీర్‌పేట్‌లోని స్వీట్ పాన్ తినే వ్యక్తి వరకు అందరూ ఇదే విషయాన్ని చర్చించుకున్నారు. సెకండ్ హాఫ్ వరకు సినిమా సస్పెన్స్ అన్నట్టు సాగింది. అయితే కిమ్ బతికే ఉన్నట్టు తరువాత ప్రపంచానికి తెలిసింది.
Also Read | Yearender 2020: ఈ ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...
పోలాండ్ పొరపాటు
2020 సంవత్సరం ఒక చొరాబాటు కూడా జరిగింది. అయితే అది కావాలని చేసింది కాదు. చిన్న పొరపాటు అని పోలాండ్ తరువాత తెలిపింది. మహమ్మారి నివారణ చర్యలో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేసే తరుణంలో పోలాండ్ సైన్యం చెక్ రిపబ్లిక్ దేశంలోకి ప్రవేశించింది. తరువాత అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టి మ్యాటర్ సెట్ చేశారు.
గ్రహాంతర వాసులు..
అమెరికాలోని (America) పెంటగాన్ మూడు ప్రత్యేకమైన వీడియోలను ప్రపంచంతో పంచుకుంది. ఇందులో ఎగిరే పళ్లాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని గుర్తింపులేని ఎగిరేపళ్లాలు అని తెలిపింది అమెరికా.
మిడతల దండు
కరోనావైరస్ సరిపోదంటూ రైతులను భయపెట్టడానికి మిడతల దండు భారతదేశంపై దండయాత్ర ప్రకటించింది. కొన్ని వేల ఎకరాల పంటను నాశనం చేశాయి.
Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe