జంతువులకు మనసు ఉంటుందా అనేది చాలా మందికి వచ్చే సందేహం. నిజానికి బాధ, సంతోషం, కోపం, ఆవేశం, జాలి, దయ ఇలాంటి ఎమోషన్స్ కేవలం మనుషులకే పరిమితం అనుకుంటాము. కానీ జంతువులకు కూడా ఈ ఇమోషన్స్ ఉంటాయి. దీనికి ఉదాహరణే ఈ వీడియో. సోషల్ మీడియాలో ( Social Media ) ఈ వీడియో బాగా వైరల్ ( Viral Video ) అవుతోంది. చాలా మంది షేర్ చేస్తున్నారు. దీనికి ఐఎఫ్ ఎస్ ( IFS) అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఎకౌంట్ లో షేర్ చేశారు.
The smallest act of kindness
Is worth more than the greatest intention💕 pic.twitter.com/eQijHBxkUM— Susanta Nanda (@susantananda3) August 23, 2020
ఈ ట్రెండింగ్ వీడియోలో ( Trending Video ) ఒక చేప నేలపై పడిఉండటాన్ని మీరు చూడవచ్చు. ఈ చేపను చూసిన కొన్ని పందులు దాన్ని నీటిలోకి నెట్టి దాని ప్రాణాలు కాపాడుదాం అని అనుకుంటారు. దాని కోసం అవన్నీ ఒక్కటై నోటితో చేపను నెడుతూ చివరికి దానిని నీటిలో పడేస్తారు. ఈ వీడియోను చూసిన తరువాత చాలా మంది వాటిని తెగ మెచ్చుకుంటున్నారు. మనిషికి ఇబ్బంది వస్తే సాటి మనిషి స్పందించని ఈ రోజుల్లో చేప ప్రాణాలు కాపాడటానికి ఇవి కష్టపడుతున్నాయి.. వీటికి హ్యాట్సాఫ్ అని కొంత మంది కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి
-
Dirty Money: నాలాలో నోట్ల వరద...ముక్కుమూసుకుని తీసుకుంటున్న స్థానికులు
-
Electric Rice Cooker: ఎలక్ట్రిక్ కుక్కర్ కొంటున్నారా ? ఇది చదవండి
-
Lavender Oil Benefits: లావెండర్ ఆయిల్ వల్ల అనేక లాభాలు...ఎలా వినియోగించాలంటే…
-
Golden Turtle: నేపాల్ లో బంగారు వర్ణం తాబేలు... విష్ణుమూర్తి అవతారం అంటున్న ప్రజలు
-
Covid-19 Ointment: వచ్చేసింది కరోనాను అంతం చేసే ఆయింట్ మెంట్