Wild life Protection: మన దేశంలో వన్యప్రాణుల వేట ఒక్కటే కాదు..కొన్ని జంతువుల్ని, పక్షుల్ని పెంచటం కూడా నేరమే. స్వేచ్ఛగా తిరగకుండా ఓ చోట బందీ చేయడం చట్టరీత్యానేరం. అసలు ఇండియాలో ఏ జంతువుల్ని పెంచుకోవడం నిషేధమో తెలుసుకుందాం.
దేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం( Wild Life Protection 1972) అమల్లో వచ్చి ఇవాళ్టికి 49 ఏళ్లు. 1972 ఆగస్టు 21న ఈ చట్టం అమల్లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం అడవి మొక్కలు, జంతువులు, పక్షుల్ని వేటాడటం కానీ, హింసించడం కానీ, గాయపర్చం లేదా నాశనం చేయడం గానీ , శరీర భాగాల్ని తీసుకోవడం గానీ నేరం. సరిసృపాలు, పక్షుల గూళ్లను కదల్చడం, నాశనం చేయడం కూడా శిక్షార్హమే. అంతేకాదు కొన్ని రకాల జంతువులు, పక్షుల్ని పెంచుకోవడం కూడా నేరమే. ఆఖరికి వన్యప్రాణి సంస్థ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పార్కులు, వన్యప్రాణి కేంద్రాల సరిహద్దుల్ని మార్చకూడదు. అంత కఠినమైంది ఈ చట్టం. అంత విస్తృతమైంది కూడా. ఈ చట్టానికి సంబంధించి మరికొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పులులు, సింహాల వంటి క్రూరమైన జంతువులే కాదు..కొన్ని సాధు జంతువుల్ని కూడా పెంచుకోకూడదు. తాబేళ్లను పెంచుకోవచ్చు కానీ, ఇండియన్ స్టార్, రెడ్ ఇయర్ స్లైడర్ వంటి తాబేలు రకాల్ని పెంచకూడదు. సముద్రపు జీవుల్ని వాటి నివాస స్థావరాల్నించి తీసుకొచ్చి..అక్వేరియం(Aquarium)లేదా పాత్రల్లో పెంచడం నేరం. పక్షుల్లో అయితే చిలుకల్లో ఓ రకమైన ప్యారకీట్స్, నెమళ్లు, కోయిలలు, మునియా వంటివాటిని పెంచడం నేరం. వినోదం కోసం కోతుల్ని పెంచడం లేదా శిక్షణ ఇవ్వడం కూడా నేరంగా పరిగణిస్తారు. అందుకే జంతువుల్ని పక్షుల్ని పెంచుకోవాలనుకున్నప్పుడు 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి తెలుకుకోవడం మంచిది. లేదంటే అనవసర ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవడమే.
Also read: Afghanistan Cricket: తాలిబన్ల చేతిలో ఆఫ్ఘన్ క్రికెట్ కార్యాలయం, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌పై నీలినీడలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook