Prayag raj maha kumbh mela girls in train wash room: కుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు భారీగా వస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ప్రయాగ్ రాజ్ కుంభమేళకు ఇప్పటి వరకు 39 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. మరోవైపు యోగి సర్కారు కుంభమేళకు వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కుంభమేళకు వెళ్తున్న రైళ్లు, బస్సులు, విమానాల్లో రద్దీ కొనసాగుతుంది.
ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే కుంభమేళలకు వెళ్తున్న వారికి కోసం ప్రత్యేకంగా రైళ్లను నడుపుతుంది. కానీ ఈ రైళ్లు ఏ కోసాన కూడా సరిపోవడం లేదు. భక్తులు కుంభమేళకు వెళ్లేందుకు భారీగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో రైళ్లన్ని ఏసీ కోచ్లు కూడా జనరల్ కోచ్ ల మాదిరిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్న కొంత మంది అమ్మాయిలు ఏకంగా వాష్ రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టేసుకున్నారు.
అంతటితో ఆగకుండా.. అక్కడ కూడా రీల్స్ తీసుకుంటూ హల్ చల్ చేశారు. వీళ్లు రీల్స్ చేసి మరీ తాము వాష్ రూమ్ లో ఉన్నామని, డోర్ లాక్ వేశామని చెప్తున్నారు. ట్రైన్ అంతా ఫుల్ గా ఉందని, కనీసం నిలబడేందుకు కూడా జాగాలేదని, అందుకే బాత్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నామని ఈ వీడియోలో వాళ్లు చెప్పడం కన్పించడం కన్పిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read more: Maha kumbh Mela: కుంభమేళ నుంచి వెళ్లిపోతున్న అఖాడా నాగ సాధులు.. కారణం ఏంటంటే..?
దీన్ని చూసిన నెటిజన్లు అమ్మాయిలు చేసిన పనిపై మండిపడుతున్నారు. బాత్రూమ్ లో వెళ్లి డోర్ పెట్టుకొవడం ఏంటని మండిపడుతున్నారు. ఆ వాష్ రూమ్ లోకి వెళ్లడం మాత్రమే కాకుండా.. అక్కడ కూడా రీల్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఆ స్మెల్ భరిస్తు ఎలా ఉంటున్నారు బాబోయ్ అంటూ మరికొందరు షాక్ కు గురౌతున్నారు. మొత్తంగా ఈ అమ్మాయిలు చేసిన పనిని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.