Astro Tips: జ్యోతిష్యశాస్త్రంలో మనకు తెలియని చాలా విషయాల గురించి ప్రస్తావన ఉంది. ఏవి ఎలా చేయకూడదు, ఎలా చేయవచ్చనే విషయాలున్నాయి. పాటించకపోతే కష్టకాలం ప్రారంభమైనట్టే. కొన్ని వస్తువులనైతే పొరపాటున కూడా అడగకూడదని ఉంది.
స్నేహంలో, బంధుత్వంలో అవసరమైనప్పుడు కొన్ని వస్తువులు అడిగి తీసుకోవడం అలవాటే. లేదా ఎవరైనా అడిగితే మనమే ఇస్తుంటాం. అప్పు కావచ్చు లేదా ఒకసారి వాడుకునేందుకు కావచ్చు. అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఇదే. కానీ జ్యోతిష్యం ప్రకారం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒకరి వస్తువులు మరొకరు వాడటం వల్ల ఒకరి భాగ్యం మరొకరిరి ఆ వస్తువుతో పాటు వెళ్లిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అందుకే ఏయే వస్తువుల్ని అప్పుగా తీసుకోకూడదనేది పరిశీలిద్దాం..
గడియారం లేదా వాచ్
అవసరమున్నప్పుడు ఒకరి వస్తువు మరొకరు వాడటంలో తప్పులేకపోయినా..జ్యోతిష్యం మాత్రం ఇందుకు కాదంటోంది. ముఖ్యంగా గడియారం వాడటానికి మరొకరి నుంచి తీసుకోకూడదు. జ్యోతిష్యం ప్రకారం గడియారమంటే కేవలం సమయం గురించి చెప్పేదే కాకుండా..ఆ వ్యక్తి భాగ్యాన్ని కూడా నిర్ధారించేది. ఇతరుల వాచ్ ధరించడం వల్ల వ్యక్తి స్థితిపై ప్రభావం చూపిస్తుంది.
పెన్ను
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పెన్ ఒకరికి ఇవ్వకూడదు..మరొకరి నుంచి తీసుకోకూడదు. ఎందుకంటే పెన్ అంటే రాసేది. అంటే ఒకరి అదృష్టాన్ని రాసేది కూడా అదే. అంటే పెన్ ఇస్తున్నారంటే..తమ అదృష్టాన్ని మరొకరికి ఇచ్చేస్తున్నట్టే లెక్క. మీ పనుల ఫలంలో సగం మరొకరికి వెళ్లిపోతుంది.
వస్త్రాలు
మీ బట్టలు మరొకరికి ఇవ్వకూడదు, మరొకరి బట్టలు మీరు అప్పుగా తీసుకోకూడదు. మరొకరి బట్టలు ఒకసారి వాడేందుకు తీసుకోవడం వల్ల ఎదుటి వ్యక్తిలోని పాజిటివ్ లేదా నెగెటివ్ శక్తి ప్రభావం మీపై పడుతుంది. ఎందుకంటే బట్టల సంబంధం నేరుగా శుక్రగ్రహంతో ఉంటుంది. అప్పుగా తీసుకున్న బట్టల్ని ధరించడం వల్ల శుక్రుడు బలహీనమౌతాడు. ఫలితంగా మీ ఆర్ధిక పరిస్థితి పాడవుతుంది. అందుకే జ్యోతిష్యం ఈ వస్తువుల్ని మరొకరి నుంచి తీసుకోవద్దంటోంది.
Also read: Astro Remedies: ఆర్ధికంగా చితికిపోయున్నారా..రూపాయి నాణెంతో ఇలా చేస్తే చాలు, అదృష్టం మారిపోతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook