Budh Guru Yuti 2023: మీనరాశిలో బుధ-గురు సంయోగం.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం..

Budh Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, మీనరాశిలో బుధుడు, బృహస్పతి సంయోగం ఏర్పడింది. దీంతో 5 రాశులవారికి మహర్ధశ పట్టనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2023, 12:21 PM IST
Budh Guru Yuti 2023: మీనరాశిలో బుధ-గురు సంయోగం.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం..

Budh-Guru Yuti 2023: గ్రహాల యువరాజైన బుధుడు రీసెంట్ గా తన రాశిని మార్చి మీనరాశిలోకి ప్రవేశించాడు. దేవగురువు బృహస్పతి ఇప్పటికే మీనరాశిలో సంచరించస్తున్నారు. దీంతో మీనరాశిలో మెర్క్యూరీ మరియు జ్యూపిటర్ కలయిక ఏర్పడింది. వ్యాపారం మరియు కమ్యూనికేషన్ మొదలైన వాటికి బుధుడిని కారకుడిగా భావిస్తే.. గౌరవం, ఐశ్వర్యం, సుఖాలు మరియు సంపద మొదలైన వాటికి బృహస్పతిని కారకుడిగా పరిగణిస్తారు. బుధ మరియు గురుల కలయిక కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

బుధ-గురు సంయోగం ఈ రాశులకు శుభప్రదం
వృషభ రాశి
గురు-బుధ కలయిక వృషభరాశివారికి చాలా మేలు చేస్తుంది. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగలకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి
బుధ, గురు గ్రహాల సంయోగం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు జీవితంలో సర్వసుఖాలు దక్కుతాయి. బ్యాంకింగ్ మరియు మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. 
మీన రాశి
ఈ రాశిలోనే బుధ బృహస్పతి సంయోగం ఏర్పడుతుంది. దీంతో మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. ఆఫీసులో పెద్ద బాధ్యతలు తీసుకుంటారు. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. 
కన్య రాశి
బృహస్పతి మరియు బుధుడు మైత్రి  కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. బిజినెస్ అద్భుతంగా ఉంటుంది. 
ధనుస్సు రాశి
బుధుడి సంచారం ధనుస్సు రాశి వారికి జీవితంలో శుభ ఫలితాలనిస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సమకూరుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. 

Also Read: Mangal Gochar 2023: అంగారక సంచారం ఈ రాశులకు ప్రత్యేకం.. వీరికి రాబోయే 69 రోజులపాటు డబ్బే డబ్బు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News