Do Not Use in Lord Shiva puja: హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరో నమ్మకం ప్రకారం ఈరోజు పాలసముద్రం నుంచి హాలాహలం బయటకు వస్తే లోకకల్యాణం కోసం శివుడి ఆ విషాన్ని సేవిస్తాడు. ఆరోజు నుంచి గుర్తుగా మహాశివరాత్రిని వేడుకగా జరుపుకొంటారు. శివుడికి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ఫాల్గున మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్ధశి తిథి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 8 శుక్రవారం రోజు మహాశివరాత్రి రానుంది. ఈరోజు శివునికి పాలాభిషేకం చేయాలి. శివుడికి ప్రదోషకాలంలో చేసే పూజ అత్యంత విశిష్టమైంది. ఆ తర్వాత శివపురాణం పఠించాలి. అంతేకాదు శివుడికి ఇష్టమైన పూలను కూడా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం జాతకంలో తగ్గిపోతుంది.అయితే, శివపూజలో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు. లేదంటే పరమేశ్వరునికి పట్టరాని కోపం వస్తుంది. ఆ వస్తువులు ఏంటో ఎందుకో తెలుసుకుందాం.
తులసి..
శివపూజలో తులసి నిషిద్ధం. తులసి ఆకులను ఎట్టిపరిస్థితుల్లో మహాశివరాత్రి మాత్రమే కాదు సాధారణ రోజుల్లో కూడా ఉపయోగించకూడదు. దీనికి పురాణాల్లో ఓ కథ ఉంది. పూర్వజన్మలో తులసి జలంధరుడి అనే రాక్షసుడి భార్య ఉంటుంది. ఆమె విష్ణుభక్తురాలు. ఈ కారణంగా జలంధరుడు దేవతలందరినీ యుద్ధంలో ఓడిస్తాడు. తన భర్త నిండునూరేళ్లు బతకాలని నిత్యం కర్మలు చేస్తుండేది. అందుకే ఆ రాక్షసుడు ఎప్పుడూ ఓడిపోలేదు. అత గాడి ఆగడాలు అంతు లేకుండా పోయింది. దీంతో సాక్షత్తూ శివుడే వచ్చి జలంధరుడిని హతమార్చాల్సి వచ్చింది. నాటి నుంచి శివుడు, గణేశుడి పూజలో తులసి ఆకులు వాడటం నిషిద్ధం.
పసుపు..
పసుపు పరమపవిత్రమైంది. ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా పసుపుతోనే ప్రారంభిస్తారు. అయితే, శివపూజలో మాత్రం పసుపు నిషిద్ధం. ఎందుకంటే పసుపు స్త్రీలకు సంబంధించింది. అందుకే శివయ్య పూజలో పసుపును వాడరు. ఏ ఇతర శివపూజ సమయంలో కూడా శివలింగానికి పసురు రాయడం నిషిద్ధం.
ఇదీ చదవండి: శివయ్యకు ఇష్టమైన నైవేధ్యాలు ఏంటో తెలుసా?
సింధూరం..
శివపూజలో పెట్టకూడని మరో వస్తువు సింధూరం. దీనికి మన హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా హిందూ మతం ఆచరించే స్త్రీలు తమ భర్త సుదీర్ఘకాలంపాటు బతకాలని నుదిటిపై సింధూరాన్ని ధరిస్తారు. కానీ, శివపూజలో సింధూరం పొరపాటున కూడా పెట్టకూడదు.
విరిగిన బియ్యం..
శివపూజలో విరిగిన బియ్యం పొరపాటున కూడా వాడకూడదు. విరిగిన బియ్యంతో చేసిన అక్షితలను కూడా శివపూజలో వాడకూడదు. ఎందుకంటే విరిగిన బియ్యం హిందూ మతంలో అశుభంగా పరిగణిస్తారు.
ఇదీ చదవండి: మహాశివరాత్రికి ముందు కలలో పాము కనిపిస్తే ఏ సూచనో తెలుసా?
శంఖం..
శివపూజలో పొరపాటున కూడా పెట్టకూడని మరో వస్తువు శంఖం. సాధారణంగా ఈ శంఖంలో శంఖచూడు అనే శక్తివంతమైన రాక్షసుడు నివసిస్తాడు. అందుకే పొరపాటున కూడా మహాశివరాత్రి రోజు శంఖంతో నీటిని శవపూజలో వాడకూడదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter