Ketu In Sun Zodiac Sign Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతు గ్రహాన్ని నీడ, మాయ గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల మొత్తం అన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ గ్రహం అశుభ స్థానంలో ఉన్న రాశుల వారికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే కేతు గ్రహం మే 18వ తేదీన రాశి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేయడం గమనించవచ్చు.
కేతు గ్రహం కన్యా రాశిలో నుంచి రివర్స్ దిశలో సూర్యుడు అధిపతిగా వ్యవహరించే సింహ రాశిలోకి ప్రవేశించ బోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావం పడితే.. మరికొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కేతు గ్రహ సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
మీన రాశి వారికి కేతు గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో సానుకూల మార్పులు వస్తాయి. దీని కారణంగా వీరు అద్భుతమైన ఆర్థిక లాభాలు పొందడమే కాకుండా భారీగా డబ్బును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వీరికి ఈ సమయంలో ధైర్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఎలాంటి పనులైనా చాలా చక్కగా చేయగలుగుతారు.
మిథున రాశి
ఇక మిథున రాశి వారికి కూడా మే నెల నుంచి జీవితం ఎంతో చక్కగా ఉంటుంది. అలాగే వీరికి అనుకున్న పనులన్నీ కూడా వెంటవెంటనే జరిగిపోతాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త జాబ్ ఆఫర్స్ లభించడమే కాకుండా ఉన్న జాబుల్లో ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. ఇక వీరికి ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు కేతువు గ్రహం సంచారం చేయడం కారణంగా వీరికి ఇష్టమైన వారితో అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా ఆశించిన ఫలితాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు కూడా ఈ సమయంలో వెళ్లగలుగుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి కూడా కేతువు గ్రహం సింహరాశిలోకి వెళ్లడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ప్రశంసలు లభించడమే కాకుండా.. ఆర్థికపరంగా కూడా చాలా బాగుంటుంది. నిరుద్యోగ యువతకు ఈ సమయంలో ఉద్యోగాలు లభించడమే కాకుండా మంచి ప్యాకేజీలతో కూడిన ఆఫర్స్ కూడా వండగలుగుతారు. అలాగే తండ్రి సపోర్టు లభించి ఆర్థికపరమైన విషయాల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.