Money Lines in Hand, Palmistry : హస్తసాముద్రికం శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి చేతిలో ఉన్న రేఖలు వారి భవిష్యత్తు గురించి చెబుతాయి అని చాలామంది చెప్పడం మీరు కూడా వినే ఉంటారు. జీవితంలో ఎంత మేరకు అదృష్టం కలిసి వస్తుంది, ఏ మేరకు కష్టాలు చవిచూడాల్సి వస్తుంది అనే వివరాలను ఈ రేఖలే చెబుతాయని హస్తసాముద్రికం తెలిసిన వారు చెబుతున్నారు. అలా చేతిలో ఉండే రేఖల్లో ఒక్కో రేఖకు ఒక్కో ప్రత్యేకత ఉందని.. అలా ధన రేఖ ఉన్న వారికి ధనం వద్దన్నా వచ్చిపడుతుందని చెబుతుంటారు.
చేతిలో ధన రేఖ ఎక్కడ ఉంటుందంటే..
చిటికెన వేలు కింది భాగంలో ఈ ధన రేఖ ఉంటుంది. అయితే ఆ ధన రేఖ ఎలా ఉంటే సరిసంపదలు కలిసి వస్తాయి, ఎలా ఉంటే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అరచేతిలో ధన రేఖతో పాటు మంగళ రేఖ కూడా చివరి వరకు ఉన్న వారికి ఆర్థికంగా కలిసి వస్తుందని హస్తసాముద్రికం చెబుతోంది. ఒకవేళ అరచేతిలో అలాంటి రేఖ ఉన్నట్లయితే, వారు ఊహించని రీతిలో పూర్వీకుల నుంచి భారీ మొత్తంలో ఆస్తిని పొందుతారు. అదే సమయంలో తమ స్వశక్తితోనూ బాగా డబ్బు సంపాదిస్తారు.
అరచేతిలో ధన రేఖ ఎంత స్పష్టంగా ఉంటే వారికి అంత ఎక్కువ సంపద కలుగుతుందట. అలాంటి వారు చాలా ధనవంతులు అవుతారని హస్తసాముద్రిక శాస్త్రం చెబుతోంది.
ధన రేఖతో పాటు అరచేతిలో సూర్య రేఖ కూడా స్పష్టంగా ఉన్న వారికి కేవలం ధనం మాత్రమే కాకుండా సమాజంలో గౌరవాన్ని కూడా పొందుతారు.
ధన రేఖ ద్వారా మాత్రమే కాకుండా ఇంకొన్ని ఇతర మార్గాల్లోనూ ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుందట. ఆధ్యాత్మిక గ్రంధాల ప్రకారం సూర్య పర్వతంపై కనిపించే త్రిభుజం ఆకారంలో ఉండే చిహ్నం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు. అరచేతిల అలాంటి త్రిభుజం గుర్తు ఉన్న వారు నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ.. తమ సొంత కష్టార్జితంతో అభివృద్ధి సాధించి ధనవంతులు అవుతారట.
బృహస్పతి పర్వతంపై ఉండే గుర్తు కలిగి ఉన్న వారు కూడా అదృష్టానికి తోడు కష్టపడి పనిచేసి చాలా ధనవంతులు అవుతారట. అరచేతిలో ఈ చిహ్నం ఉన్నట్టయితే.. వారికి నైపుణ్యం, దూరదృష్టి ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా వారు నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ తమ స్వశక్తితో పైకి ఎదిగి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని హస్తసాముద్రికం చెబుతోంది.
( గమనిక: ఈ కథనంలో ప్రస్తావించిన సమాచారం సమాజంలోని విశ్వాసాల ఆధారంగా రాసినవి. ఈ అభిప్రాయాలు, సూచనలతో జీ న్యూస్ ఏ విధంగానూ ఏకీభవించడం లేదు )
ఇది కూడా చదవండి : Renault Kwid Prices: మరింత అందుబాటులోకి రెనో క్విడ్ RXE వేరియంట్ కారు ధర
ఇది కూడా చదవండి : Why Cars Catches Fire: కార్లలో మంటలు ఎందుకు వస్తాయో తెలిస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు
ఇది కూడా చదవండి : Highest Selling Car Brands: ప్రస్తుతం ఎక్కువగా సేల్ అవుతున్న కార్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook