Panchak 2022: పంచకం మొదలైంది.. ఈ 5 రోజులు ఈ పనులు చేయకండి..

Panchak 2022: దసరా ముగియగానే అక్టోబర్ 6వ తేదీ నుంచి పంచకం ప్రారంభమవుతుంది. ఈ 5 రోజులలో కొన్ని ప్రత్యేక పనులు చేయడం నిషిద్ధం, అయితే కొన్ని శుభ కార్యాలు చేయవచ్చు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2022, 10:39 AM IST
Panchak 2022: పంచకం మొదలైంది.. ఈ 5 రోజులు ఈ పనులు చేయకండి..

Panchak October 2022 Date: మన ఇంట్లో శుభకార్యాలు చేయాలన్నా, ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాలన్నా ముహూర్తం చూస్తాం. అయితే ఆస్ట్రాలజీ ప్రకారం పంచకంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. ఈసారి పంచకం (Panchak October 2022) అక్టోబరు 6వ తేదీ నుండి ప్రారంభమై... అక్టోబరు 10 సోమవారం సాయంత్రం 4:3 గంటలకు ముగుస్తుంది. 

పంచకంలో ఈ పనులు చేయకూడదు
>> పంచక సమయంలో దక్షిణ దిశలో ప్రయాణించరాదు. దీంతో మీకు నష్టం వాటిల్లుతోంది.
>> పంచకం సమయంలో ఇంటిపైకప్పు వేయకూడదు. లేకుంటే ఇంట్లో మనస్పర్థలు తలెత్తుతాయి, అదే విధంగా ధన నష్టం వాటిల్లుతుంది. 
>> పంచక్ సమయంలో మంచం కొనకూడదు లేదా తయారు చేయకూడదు.
>> పంచక సమయంలో కలప, కర్రలు లేదా ఎలాంటి ఇంధనాన్ని కొనుగోలు చేయరాదు. 
>> పంచక సమయంలో ఎవరైనా మరణిస్తే... పంచక దోషం పోవడానికి పిండి ముద్దతో దిష్టిబొమ్మలు తయారుచేసి మృతదేహంతోపాటు ఉంచాలి. చేయని ఎడల కుటుంబంలోని ఐదుగురు జీవితాల్లో సంక్షోభం ఏర్పడుతుందని నమ్ముతారు. లంకాపతి రావణుడు కూడా పంచకాల్లో మరణించాడు.

పంచక సమయంలో ఈ పనులు చేయవచ్చు..
పంచకంలో కూడా పూజలు చేయవచ్చు. అయితే ఈ సమయంలో ధనిష్ట, శతభిష, పూర్వ భాద్రపద మరియు రేవతి నక్షత్రం వంటి కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడితే.. ముఖ్యమైన ప్రయాణాలు, క్షౌర పనులు మరియు వ్యాపారం చేయవచ్చు. అంతే కాకుండా ఉత్తరాభాద్రపద నక్షత్రాల వారీగా సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడితే నిశ్చితార్థం, వివాహం, కొత్త పని ప్రారంభించడం వంటి శుభ కార్యాలు కూడా జరుపవచ్చు.

Also Read: Lunar Eclipse 2022: చంద్ర గ్రహణం తేదీ, సమయం ఎప్పుడు, దీపావళిపై చంద్ర గ్రహణ ప్రభావం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News