Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

Rakshabandhan 2023: రక్షాబంధన్ కు కౌంట్ డౌన్ మెుదలైంది. 2023లో ఈ పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. సరైన తేదీ ఎప్పుడో తెలుసుకోండి.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2023, 05:54 AM IST
Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

Raksha Bandhan 2023 Date: ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి రోజునే అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు. సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ రెండు రోజులపాటు జరుపుకోనున్నారు. ఇది ఆగస్టు 30న ప్రారంభమై..ఆగస్టు 31 వరకు ఉంటుంది. అయితే రాఖీని శుభముహూర్తంలో కడితేనే సోదరుడికి మేలు జరుగుతుంది. భద్రకాలంలో అస్సలు రాఖీని కట్టకూడదు. ఆ సమయంలో కడితే మీ సోదరుడు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

రాఖీ కట్టడానికి శుభ సమయం

ఈ సంవత్సరం రాఖీ పంండుగను ఏ రోజు జరుపుకోవాలా అనే విషయంపపై జనాల్లో గందరగోళం నెలకొంది. నిజానికి రక్షాబంధన్ యొక్క శుభ సమయం ఆగస్టు 30న రాత్రి 09:01 గంటల ప్రారంభమై..ఆగస్టు 31 ఉదయం 07:05 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా మీ సోదరుడికి రాఖీ కట్టవచ్చు.

Also Read: Shubh Yog: జాతకంలో ఈ యోగం ఉంటే.. మీరు కింగ్ లా బతుకుతారు..!

భద్ర కాలం

ఆగస్టు 30న ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు భద్ర కాలం ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదు, రాఖీ కూడా కట్టకూడదు. సోదరీమణులారా భద్ర ముహూర్తంలో పొరపాటున కూడా రాఖీ కట్టవద్దు. ఎందుకంటే భద్ర ముహూర్తంలో రాఖీ కట్టడం అశుభంగా భావిస్తారు.  ఎందుకంటే లంకాధిపతి రావణుడి సోదరి భద్ర ముహూర్తంలో రాఖీ కట్టడం వల్లే రాముడి చేతిలో చంపబడ్డాడు.

Also Read: Vakri Shani 2023: ఈ 3 రాశుల జీవితాన్ని అల్లకల్లోలం చేయనున్న శని.. మీది ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News