Shani Rashi Parivartan 2023: జ్యోతిషశాస్త్రంలో శని దేవున్ని న్యాయ దేవతగా చెప్పకుంటారు. ఎందుకంటే శని దేవుడు మనవుడు చేసే కర్మలను దృష్టిలో పెట్టుకుని ఫలితాలను, అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అయితే జనవరి నెలలో చాలా రకాల మార్పులు జరగబోతున్నాయి. శని గ్రహం 2023లో కుంభరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా చాలా రకాల మార్పలు సంభవిస్తాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం వల్ల తిరోగమన రాజయోగ దశ ఏర్పడబోతోంది. దీంతో ఈ కింది రాశులవారు జీవితంలో ఎప్పుడు సాధించలేని లాభాలు పొందడమేకాకుండా ఊహించని డబ్బు కూడా పొందే అవకాశాలున్నాయి. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశివారు అదృష్టవంతులుగా మారబోతున్నారు:
కర్కాటక రాశి:
కర్కాటక రాశి ఈ సంచారం కారణంగా ఎనిమిదవ స్థానంలో ఉండబోతోంది. దీని కారణంగా రాజయోగ గడియలు రాబోతున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కర్కాటక రాశివారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఉన్న శిఖరాలు ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.
కన్యారాశి:
ఈ రాశి సంచారం వల్ల శని దేవుడు ఆరవ స్థానంలో ఉండబోతున్నాడు. దీంతో చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో కన్యారాశి వారి అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ రాశి వారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ క్రమంలో విజయాలు సాధిస్తారు.
మీన:
మీన రాశివారికి శని గ్రహం పన్నెండవ స్థానంలో ఉండడంతో ఈ రాశివారు చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలిక వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం లభించి ఆరోగ్యవంతులుగా మారుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో తీవ్ర లాభాలు పొంది. ఉన్నత శిఖరాలకు చేరుతారు.
Also Read : Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్
Also Read : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook