Rajyogam: 30 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

Akhand Samrajya Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, త్వరలో అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ఊహించని బెనిఫిట్స్ పొందనున్నారు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 01:37 PM IST
Rajyogam: 30 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

Akhand Samrajya Rajyog: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా భావిస్తారు. ప్రస్తుతం అస్తమయంలో ఉన్న శనిదేవుడు వచ్చె నెలో ఉదయించబోతున్నాడు. శనిదేవుడి రైజింగ్ వల్ల అరుదైన 'అఖండ సామ్రాజ్య రాజయోగం' ఏర్పడుతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ముఖ్యంగా మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

శనిదేవుడి ఉదయం ఈరాశులకు శుభప్రదం
మకరం
అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడటం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మీ రాశి నుండి ధనవంతుల గృహంలో ఉదయించబోతున్నాడు. దీంతో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సమాజంలో పాపులారిటీ పెరుగుతుంది. మీ స్కిల్స్ పెరుగుతాయి. మీడియా, ఫిల్మ్, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు లాభపడతారు. 
ధనుస్సు 
అఖండ సామ్రాజ్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శని గ్రహం మీ రాశి నుండి మూడవ ఇంట్లో ఉదయిస్తుంది. దీని కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టదం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మీకు సోదరసోదరీమణుల మద్దతు లభిస్తుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. 
మిథునం
అఖండ సామ్రాజ్యం రాజయోగం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీంతో మీ అదృష్టం పెరుగుతుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. 

Also Read: Budh Uday: మీనంలో ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు జాబ్ గ్యారంటీ, ఉద్యోగులకు ప్రమోషన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News