Vijayadashami 2024 Facts: రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నవరాత్రుల తర్వాత జరుపుకునే ఈ పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. చెడుపై మంచి గెలిసిన సందర్భంగా జరుపుకునే ఈ పండగ రోజున హిందూ భక్తులంతా ఎంతో ఆనందంగా అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా ఈ పండగ పల్లె ప్రాంతాల్లో ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈరోజు చాలామంది ఉదయాన్నే లేచి దుర్గామాతకి ప్రత్యేకమైన పూజలు చేసి జంబి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ నిర్వహించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పురాణాల ప్రకారం విజయదశమి పండగ రోజున తప్పకుండా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో తెలిపారు. అయితే దసరా పండగ రోజున తప్పకుండా చేయాల్సిన పనులేంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దసరా పండగ రోజున తప్పకుండా చేయాల్సిన పనులు:
ఉదయాన్నే నిద్ర లేవల్సి ఉంటుంది:
విజయదశమి రోజున తప్పకుండా ఉదయం 5 గంటలకే నిద్ర లేవల్సి ఉంటుంది. ఆ తర్వాత వీలైతే నదీ స్నానాన్ని ఆచరించి.. పట్టు వస్త్రాలను ధరించడం చాలా మంచిదని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు.
ఇంటిని శుభ్రం చేయాలి:
తప్పకుండా విజయదశమి పండగ రోజున ఇంటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. వీలైతే ఇల్లునంతా గంగాజలంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత ఇంటి ముందు తప్పకుండా కల్లాపి చెల్లాల్సి ఉంటుంది.
అమ్మవారిని పూజించడం:
విజయదశమి పండగ రోజున తప్పకుండా అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అమ్మవారిని పూజించడం వల్ల ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని పురాణాల్లో తెలిపారు.
ఆయుధం పూజ:
పురాణాల ప్రకారం ఆయుధ పూజకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈరోజు అమ్మవారిని పూజించిన తర్వాత తప్పకుండా ఆయుధ పూజ నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈ పూజ ఎంతో ప్రత్యేకమైనది.
శమీ పూజ:
విజయదశమి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో జమ్మి చెట్టును పూజించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు చెట్టును పూజించడం వల్ల ఆరోగ్యంతో పాటు సంపద వృద్ధి చెందుతుందని పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అందుకే చాలామంది ఈరోజు తప్పకుండా జమ్మి చెట్టును పూజిస్తారు.
గణపతి పూజ:
అన్ని శుభకార్యాల్లో ముందుగా చేసే పూజల్లో గణపతి పూజ ఒకటి. దసరా రోజున అమ్మవారిని పూజించే క్రమంలో వినాయకుని పూజించడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయట. అంతేకాకుండా పనుల్లో వస్తున్న ఆటంకాలు కూడా దూరమవుతాయని పురాణాల్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
పేదలకు వస్తువులు దానం చేయడం:
పురాణాల ప్రకారం, దసరా పండగ రోజున పేదలకు వస్తువులను దానం చేయడం కూడా చాలా మంచిది. ఈరోజు వస్తువులను దానం చేయడం వల్ల రహస్యంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయట. అంతేకాకుండా జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుందని పురాణాలలో తెలిపారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.