Ana Carolina Vieira: అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ క్రీడాకారిణి చేసిన పని ఆమె ఆటకే ఎసరు పెట్టింది. క్రీడా పోటీల్లో పాల్గొనకుండానే ఆమె బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె చేసిన తప్పుతో ఒలింపిక్స్ క్రీడల నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే అర్ధరాత్రిళ్లు బాయ్‌ఫ్రెండ్‌తో తిరగడమే. ఈ సంఘటన ఒలింపిక్స్‌లో ఆసక్తికరంగా మారింది.
Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. సరికొత్త చరిత్ర లిఖించిన మను భాకర్
బ్రెజిల్ దేశానికి చెందిన స్విమ్మర్ అనా కరోలినా వియెరా పారిస్ ఒలింపిక్స్‌కు వచ్చారు. స్విమ్మింగ్‌లో దేశానికి పతకం తీసుకురావాలనే కసితో పారిస్‌లో అడుగుపెట్టారు. అయితే క్రీడా గ్రామంలో ఆమె నిబంధనలు ఉల్లంఘించారు. పారిస్‌లో ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే తోటి క్రీడాకారుడైన తన ప్రియుడు గాబ్రియేల్ శాంటోస్‌తో కరోలినా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. ఒలింపిక్స్ క్రీడల కోసం వచ్చిన ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో అర్ధరాత్రిళ్లు చక్కర్లు తిరిగారు. శుక్రవారం రాత్రి తన బాయ్‌ఫ్రెండ్ గాబ్రియెల్‌తో తిరిగారు. ఆ మరుసటి రోజు శనివారం మళ్లీ ఒలింపిక్స్ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అయితే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసిన తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. వాటిని చూసిన ఒలింపిక్ సంఘం కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించడం.. అనుమతి తీసుకోకుండా వివహరించడంతో బ్రెజిల్ ఒలింపిక్ సంఘం ఆమెపై వేటు వేసింది.
అయితే ఆమె ప్రియుడు గాబ్రియెల్ శాంటోస్‌పై మాత్రం ఒలింపిక్స్ సంఘం మన్నించింది. అతడు క్షమించాలని కోరడంతో ఒలింపిక్ సంఘాన్ని కోరడంతో అతడిని మళ్లీ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగా బ్రెజిల్ ఒలింపిక్ సంఘం కీలక ప్రకటన చేసింది. 'ఒలింపిక్స్‌కు సెలవు తీసుకుని ఎంజాయ్ చేయడానికి వచ్చింది కాదు. దేశం విజయం కోసం ఎదురుచూస్తున్న మా ప్రజల కోసం ఇక్కడకు వచ్చాం. అనా కరోలినా వియెరా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. అనా కరోలినా నిబంధనలను ఉల్లంఘించడంతో కమిటీ దృష్టికి వెళ్లడంతో వారు చర్యలు తీసుకున్నారు' అని బ్రెజిల్ స్విమ్మింగ్ కమిటీ హెడ్ గుత్సవో ఒట్‌సుకా తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి