IND vs Afghan: వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై విజయంతో శుభారంభం చేసిన టీమ్ ఇండియా ఇవాళ ఢిల్లీ వేదికగా ఆఫ్ఘన్ యోధులతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో తడబడిన టాప్ ఆర్డర్ ఈసారి రాణిస్తే ఇక ఢిల్లీ వేదికపై పరుగుల వరద ఉండవచ్చు. మరోవైపు బంగ్లాదేశ్‌పై పరాజయం చెందిన ఆఫ్ఘన్ జట్టు ఇండియాను ఎలా ఎదుర్కొంటుందో..
ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్ధిని ఢీ కొట్టి విజయం సాధించిన టీమ్ ఇండియా రెండవ మ్యాచ్‌లో సులువైన జట్టుతో పోటీ పడనుంది. అలాగని ఆఫ్ఘన్ జట్టుని తక్కువ అంచనా వేసేందుకు వీల్లేదు. ఆ జట్టు కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ చేసిన వ్యాఖ్యలు ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నా నిజం లేకపోలేదన్పిస్తోంది. టీమ్ ఇండియా స్పిన్నర్ల కంటే బలమైన స్పిన్నర్లు తమ జట్టులో ఉన్నారనేది షాహిదీ చేసిన వ్యాఖ్య. ఇది నిజమే. ఆ జట్టులో రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ నబీ వంటి మెలితిరిగిన స్పిన్నర్లు ఉన్నారు. ఈ ముగ్గురిని సమర్ధవంతంగా ఎదుర్కొంటే చాలు. ఆఫ్ఘన్ జట్టుకు బలం స్పిన్నర్లే.
ఇక టీమ్ ఇండియా విషయానికొస్తే అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు ఉన్నారు. ముగ్గురిలో రవీంద్ర జడేజా ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. అశ్విన్ పరిస్థితి సందేహమే. కుల్దీప్ యాదవ్ అడపా దడపా రాణిస్తున్నాడు. ఇక టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఘోరంగా విఫలం కావడం కాస్త కలవరపెడుతోంది. అదే సమయంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీల ఆటతీరు ముచ్చటేస్తోంది. ఆఫ్ఘన్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ రాణిస్తే కచ్చితంగా పరుగులు వరద ఉండవచ్చు.
ఇండియా, ఆప్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకూ 3 వన్డేలు జరిగితే రెండింట ఇండియా గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. 2019 ప్రపంచకప్‌లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ చివరి మ్యాచ్ జరిగింది.
Also read: World Cup 2023: ప్రపంచకప్‌లో భారీ పరుగుల లక్ష్యం ఛేదించిన రికార్డు సృష్టించిన పాకిస్తాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook