India Vs Afghanistan Toss Updates: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఓటమి తరువాత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ పొట్టి ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌కు రానున్నాడు. అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఫిట్‌గా లేనందున మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఇబ్రహీం జద్రాన్‌ను కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. యశస్వి జైస్వాల్‌కు విశ్రాంతినివ్వగా.. అందరూ యంగ్ ప్లేయర్లు జట్టులోకి తీసుకున్నారు.
"మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇందుకు ప్రత్యేక కారణం లేదు. పిచ్ బాగుంది. ఇక్కడ పెద్దగా మారదు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ నుంచి పూర్తిగా నేర్చుకోవాలి. ప్రపంచ కప్‌కు ముందు మాకు ఎక్కువగా టీ20 మ్యాచ్‌లు లేవు. ఐపీఎల్ ఉన్నా.. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవు. కొన్ని అంశాలలో మెరుగవ్వడానికి ప్రయత్నిస్తాం. నేను, కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో కలిసి ఎలా ముందుకు సాగాలనే అంశంపై చర్చించాం. ఈ సిరీస్ గెలవడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ నుంచి సంజూ శాంసన్, అవేష్ ఖాన్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్ తప్పుకున్నారు.." అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
"టాస్ గెలిచి ఉంటే.. మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ అది పెద్ద సమస్య కాదు. మా ప్రణాళికలను అమలు చేస్తాం. టీ20 ప్రపంచకప్‌కు ముందు అనుభవాన్ని సాధించేందుకు ఇది గొప్ప అవకాశం. నూర్ అహ్మద్, షరాఫుద్దీన్, సలీమ్ సైఫీ ఈ మ్యాచ్‌లో ఆడట్లేదు.." అని అఫ్గానిస్థాన్ ఇబ్రహీం జద్రాన్ చెప్పాడు.
తుది జట్లు ఇలా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
అఫ్గానిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-జీబ్ రహ్మాన్.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook