Sunil Gavaskar About Sarfaraz Khan: వెస్టిండీస్‌తో జరిగే టెస్టు, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్టును శుక్రవారం బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టెస్టులు, వన్డేల్లో హిట్‌మ్యాన్ నాయకత్వం వహించనున్నాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా, ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్‌లపై వేటు వేస్తూ జట్టు నుంచి తప్పించారు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ వంటి ప్లేయర్లు టీమ్‌లోకి రాగా.. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ.. భారత బ్రాడ్‌మన్‌గా పేరు తెచ్చుకున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం సెలక్టర్లు మళ్లీ మొండి చేయి చూపారు.
సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై దిగ్గజ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విరుచుకుపడ్డారు. ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా టెస్టు జట్టును ఎంపిక చేయాలని అనుకుంటే.. రంజీ ట్రోఫీని ఆపివేయాలని సూచించారు. సర్ఫరాజ్ ఖాన్ గత మూడు సీజన్లలో 100 సగటుతో రన్స్ చేస్తున్నాడని.. జట్టులోకి ఎంపిక కావాలంటే ఏం చేయాలి..? ప్రశ్నించారు. సర్ఫరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవచ్చని.. కానీ జట్టులోకి కచ్చితంగా ఎంపిక చేయాలని అన్నారు.
'సర్ఫరాజ్ తన ప్రదర్శనపై శ్రద్ధ చూపుతున్నాడు. లేదంటే రంజీ ట్రోఫీ ఆడటం మానేయండని చెప్పండి. రంజీ వల్ల ఉపయోగం లేదని స్పష్టతనివ్వండి. ఐపీఎల్ ఆడితేనే రెడ్ బాల్ క్రికెట్‌కు సరిపోతారని మీరు అనుకుంటున్నారు..' అని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు నెట్టింట కూడా బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రుతురాజ్, గైక్వాడ్, సర్ఫరాజ్ గణంకాలను షేర్ చేస్తూ.. టీమ్ ఎవరు ఉండాలని అడుగుతున్నారు. వన్డే, టీ20 పర్ఫామెన్స్ ఆధారంగా రుతురాజ్ గైక్వాడ్‌కు టెస్టు జట్టులో చోటు కల్పిస్తే.. దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన ఆధారంగా సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా అవకాశం కల్పించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 3505 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సర్ఫరాజ్ అత్యధిక స్కోరు 301 నాటౌట్. సగటు దాదాపు 80 ఉంది. దేశవాళీ టోర్నీలో ఇంత గొప్ప రికార్డు ఉన్నా.. సర్ఫరాజ్ ఖాన్‌ను టెస్టు జట్టులోకి ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. 2022–23 రంజీ ట్రోఫీలో మూడు సెంచరీలతో సహా 92.66 సగటుతో ఆరు మ్యాచ్‌ల్లో 556 పరుగులు చేశాడు. 2021–22 రంజీ సీజన్‌లో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు.
విండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవించంద్రన్ అశ్విన్ , రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
Also Read: Nora Fatehi: అందాల బాంబ్ పేల్చిన నోరా ఫతేహి.. హాట్ ట్రీట్ అదుర్స్
Also Read: TS PECET 2023 Results: రేపు టీఎస్‌పీఈ సెట్-2023 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి