KKR vs LSG Highlights: హ్యాట్రిక్ విజయాల అనంతరం ఓటమి ఎదుర్కొన్న కోల్కత్తా నైట్‌రైడర్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. లక్నోపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తిరుగులేదని నిరూపించింది. ఫిల్ సాల్ట్ చక్కటి బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 26 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను చేజిక్కించుకుని కోల్కత్తా పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది.
Also Read: IPL Live Score 2024 LSG vs DC: ఢిల్లీకి భారీ ఊరట.. లక్నోను చిత్తు చేసి 'పంత్ సేన' కీలక విజయం
లక్నో విధించిన సాధారణ లక్ష్యాన్ని కోల్కత్తా నైట్ రైడర్స్ ఉఫ్ అంటూ ఊదేసింది. 2 వికెట్లు కోల్పోయి 26 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులు సాధించి కేకేఆర్ విజయం సాధించింది. ఫిల్ సాల్ట్ బ్యాట్‌తో దుమ్మురేపడంతో కోల్కత్తా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు గ్రౌండ్లో నిల్చుని జట్టుకు విజయం అందించాడు. 47 బంతుల్లో 89 పరుగులు సాధించి సాల్ట్ మరోసారి సత్తా చాటాడు. తన బ్యాటింగ్‌లో ఫోర్ల వర్షం కురిసింది. ఏకంగా 14 ఫోర్లు ఉండడం ఒక రికార్డు. 3 సిక్స్‌లు కొట్టి ఐపీఎల్లో మరపురాని ప్రదర్శన చేశాడు. సునీల్ నరైన్ (6), అంగక్రిష్ రఘువంశీ (7) తడబడిన వేళ సాల్ట్‌కు శ్రేయర్ అయ్యర్ (38) సహకారం అందించి కెప్టెన్ బాధ్యతను నిర్వర్తించాడు. వీరిద్దరూ పరస్పరం సహకరించుకుని లక్ష్యాన్ని ఛేదించారు.
బ్యాటర్లు ఇచ్చిన తక్కువ పరుగులను లక్నో బౌలర్లు కాపాడుకోలేకపోయారు. బ్యాటింగ్‌లో ఫెయిలైన ఎల్ఎస్జే బౌలింగ్‌లోనూ విఫలమైంది. కోల్కత్తా బ్యాటర్లను కట్టడి చేయలేక మ్యాచ్‌ను సమర్పించుకున్నారు. షామర్ జోసెఫ్ 4 ఓవర్లు వేసి 47 పరుగులు ఇచ్చేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మోసిన్ ఖాన్ మాత్రమే రెండు వికెట్లు సాధించడం గమనార్హం. మిగతా బౌలర్లు వికెట్లు పడగొట్టలేకపోయారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జియంట్స్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్వింటాన్ డికాక్ (10) తక్కువ స్కోర్‌కు పరిమితమవగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (39) పర్వాలేదనిపించాడు. కానీ రావాల్సిన పరుగులు మాత్రం రాలేదు. దీపక్ హుడా (8), మార్కస్ స్టోయినిస్ (10), కృనాల్ పాండ్యా (7), అర్షద్ ఖాన్ (5) పరుగులు తీయడంలో విఫలమైంది. నికోలస్ పూరన్ మాత్రం బ్యాట్‌తో పోరాడాడు.
అతి తక్కువ స్కోర్‌కే పరిమితమైతుందనుకున్న వేళ పూరన్ బ్యాట్‌తో సత్తా చాటాడు. బంతులు ఎక్కువ తీసుకున్నా మైదానంలో నిలబడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను రాబట్టాడు. 32 బంతుల్లో 45 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కోల్కత్తా బౌలర్లు అద్భుతం చేశారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్థి జట్టును పరుగులు చేయకుండా నియంత్రించారు. మిచెల్ స్టార్క్ తన బౌలింగ్‌తో కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అండ్రె రసెల్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: IPL Live Score 2024 MI vs RCB: ఓటమికి కేరాఫ్‌గా బెంగళూరు.. సిక్సర్ల సునామీతో ముంబై ఇండియన్స్ భారీ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter